PM Jan Dhan Yojna: జన్ ధన్ ఖాతాతో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10వేల వరకు ఓవర్‌డ్రాప్ట్ సదుపాయం
PM Jan Dhan Yojna: దేశంలో మోడీ సర్కార్ 2014లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎవరైనా జీరో బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయవచ్చు..
PM Jan Dhan Yojna: దేశంలో మోడీ సర్కార్ 2014లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎవరైనా జీరో బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పథకంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. పథకం కింద ఖాతా తెరిచిన వ్యక్తులు ఇప్పుడు ఈ ఖాతాల నుండి రూ. 10,000 వరకు మొత్తాన్ని పొందవచ్చు. ఈ మొత్తాన్ని మీ ఖాతాలో ఎలా జమ చేసుకోవచ్చు? మొత్తం ప్రక్రియ తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం పేదలకు వరం లాంటిది. ఈ పథకంలో మీరు మీ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ఖాతాదారుడు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు మీ బ్యాంక్ మేనేజర్‌ని సంప్రదించాలి. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన రుణం. బ్రాంచ్‌ని సంప్రదించిన తర్వాత, బ్యాంక్ మీకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. మీరు ATM కార్డ్ లేదా UPIతో సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంలో రోజువారీగా వడ్డీ చెల్లించాలి. మీరు చెల్లింపును మళ్లీ ODలో జమ చేస్తే, మీరు ఆ మొత్తానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు బ్యాంక్ ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలలో రూ. 5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందించేది. ఇప్పుడు దానిని రూ.10 వేలకు పెంచారు. ఓవర్‌డ్రాఫ్ట్ ప్రయోజనాన్ని పొందడానికి మీ జన్ ధన్ ఖాతా కనీసం 6 నెలల కిందట తీసి ఉండాలి.
ప్రభుత్వ ఈ పథకం కింద మీరు ఖాతాను తెరవవచ్చు. దీని కోసం మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాత్రమే అవసరం. ఈ పథకంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖాతాను తెరవవచ్చు. ఖాతాను తెరిచినప్పుడు ఖాతాదారుడికి రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది. మీరు ఈ కార్డుపై రూ. 2 లక్షల బీమా రక్షణను కూడా పొందుతారు.
ప్రభుత్వ ఈ పథకంలో ఇప్పటి వరకు 46.25 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలు తెరిచారు. మార్చి 2015లో ఈ పథకం కింద ఖాతాల సంఖ్య 14.72 కోట్లు మాత్రమే ఉండేది. 10 ఆగస్టు 2022 నాటికి ఈ ఖాతాల సంఖ్య మూడు రెట్లు పెరిగి 46.25 కోట్లకు చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి