PM Kisan Yojana: పీఎం కిసాన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే, ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. చెక్ చేసుకోండి..

వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది.

PM Kisan Yojana: పీఎం కిసాన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే, ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. చెక్ చేసుకోండి..
Pm Kisan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2022 | 1:24 PM

PM Kisan Yojana: భారతదేశ జనాభాలో దాదాపు 58% మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ కుటుంబాలన్నింటికీ.. వ్యవసాయమే ప్రాథమిక ఆదాయ వనరు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 19.92% పెరిగాయి. అయితే.. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు, పెట్టుబడి సాయం అందించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి రైతుకు ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. నిధులను విడుదల చేస్తోంది.

ప్రతి సంవత్సరం డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మొదటి విడత నగదు, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండవ విడత, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు మూడవ విడత నగదును చెల్లిస్తుంది.

PM కిసాన్ యోజన ప్రయోజనాలు.. ఇతర వివరాలు

ఇవి కూడా చదవండి
  • ఈ పథకం కింద ప్రతి రైతు ప్రభుత్వం ద్వారా ఏటా రూ.6000 పొందేందుకు అర్హులు.
  • పశ్చిమ బెంగాల్ మినహా ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.
  • ఈ పథకంతో రైతులు తమ భూమిని సాగు చేయడానికి విత్తనాలు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు.

PM కిసాన్ యోజన కింద నమోదు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు

  1. భూమి ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. ఇతర భూముల్లో సాగు చేస్తున్న రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. కుటుంబ ఆదాయం తప్పనిసరిగా 6 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  4. ప్రభుత్వ ఉద్యోగం చేసే కుటుంబంలో ఎవరూ ఉండకూడదు.
  5. రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
  6. రిజిస్ట్రేషన్ చేసుకొని ఈకేవైసీ చేసుకొని ఉంటే.. ఆ రైతులకు బ్యాంకులో నగదు జమ అవుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి