AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: తాను మరణిస్తూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన మహిళ..గ్రీన్ కారిడార్‌తో అవయవాలు తరలింపు

East Godavari: మనిషి తాను మరణిస్తూ.. అవయవదానం(Organ Donation)తో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు..  చేసే మంచి పనితో మృతి చెందినా మృతులను చిరంజీవిని చేస్తాయి..

East Godavari: తాను మరణిస్తూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన మహిళ..గ్రీన్ కారిడార్‌తో అవయవాలు తరలింపు
Brain Dead Women
Surya Kala
|

Updated on: Mar 04, 2022 | 10:10 AM

Share

East Godavari: మనిషి తాను మరణిస్తూ.. అవయవదానం(Organ Donation)తో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు..  చేసే మంచి పనితో మృతి చెందినా మృతులను చిరంజీవిని చేస్తాయి. రోజు రోజుకీ ప్రజల్లో అవయదానం పై అవగాహన పెరుగుతోంది. తమ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారు..ఇక జీవించడం కష్టం అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు(family members) అవయవాదనంతో మరికొందరి జీవితాల్లోకి వెలుగులు నింపడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) గురై  ప్రాణాలతో పోరాడుతూ.. కొందరు బ్రెయిన్‌ డెడ్‌(Brain Dead)తో బ్రతికున్న శవాలుగా మారుతున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఔదార్యంతో అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తద్వారా అనేమంది జీవితాల్లో వెలుగును నింపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సుబ్రహ్మణ్యేశ్వరి అనే మహిళ ఫిబ్రవరి 28న రోడ్డు ప్రమాదానికి గురికావడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయింది. ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు అవయవదానంపై అవగాహన కలిగించారు. దాంతో అవయవదానం చేయడానికి వారు ముందుకొచ్చారు.

ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన సుబ్రహ్మణ్యేశ్వరి కళ్ళు… రెండు కిడ్నీలను దానం ఇచ్చారు. ఒక కిడ్నీ కాకినాడ కి చెందిన రామకృష్ణ రెడ్డి అనే వ్యక్తి కి.. రెండో కిడ్నీ. విశాఖపట్నం ఆరిలోవ లోని అపోలో ఆసుపత్రికి తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రీన్ కారిడార్ ద్వారా సకాలంలో విశాఖపట్నం తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు.. మనిషి చనిపోయిన తన అవయవాలతో తిరిగి కొంత మందిని బ్రతికించవచ్చు.. మృతిరాలి కుటుంబ సభ్యులు మంచి మనస్సు తో అవయవాలు దానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:

అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..

కచ్చా బాదం సాంగ్‌కు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. అద్భుతమైన డాన్స్‌ చేసిన లిటిల్ గర్ల్.. నెట్టింట్లో వైరల్