Polavaram Project: ఏపీలో సీఎం జగన్‌తో కలిసి కేంద్ర మంత్రి షెకావత్ పర్యటన.. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
Polavaram Project: ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)sy కలిసి ఆయన పోలవరంలో..
Polavaram Project: ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)sy కలిసి ఆయన పోలవరంలో పర్యటిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జలశక్తి మంత్రి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అయితే ఇందుకూరు పేట వద్ద ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌లకు అధికారులు స్వాగతం పలికారు. నిర్వాసితుల పునరావాస కాలనీలను పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు 1లో నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్, మంత్రి షెకావత్‌లు మాట్లాడారు. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో ముచ్చటించనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ కానున్నారు. దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, ఆగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం 306 నిర్వాసితుల కుటుంబాలు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి: