AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father-Daughter Love: నాన్నకు ప్రేమతో.. తండ్రి పేరుని డ్రస్‌పై డిజైన్ చేయించుకున్న గౌతమ్ రెడ్డి కుమార్తె అనన్య

Father-Daughter Love: ఏ ఇంట్లో అయితే కూతుళ్లు ఉంటారో? వాళ్ళు భాగ్యవంతులు.. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు. కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు..ఇదీ భారతీయత సంస్కృతి(Indian Tradition)..

Father-Daughter Love: నాన్నకు ప్రేమతో.. తండ్రి పేరుని డ్రస్‌పై డిజైన్ చేయించుకున్న గౌతమ్ రెడ్డి కుమార్తె అనన్య
Mekapati Goutam Reddy Daugh
Surya Kala
|

Updated on: Mar 04, 2022 | 12:27 PM

Share

Father-Daughter Love: ఏ ఇంట్లో అయితే కూతుళ్లు ఉంటారో? వాళ్ళు భాగ్యవంతులు.. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు. కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు..ఇదీ భారతీయత సంస్కృతి(Indian Tradition). ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి.. కూతురు జీవితంలో నాన్న ఓ నమ్మకం… ఓ రియల్ హీరో.. కూతురు అంటే నాన్నకు మరో అమ్మ.. ఇలా ఎంత చెప్పుకున్న తండ్రీకూతురు రిలేషన్(father and daughter relationship) గురించి తరగదు. ఈ విషయాన్నీ మరోసారి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(Mekapati Goutamreddy).. కూతురు సాయి అనన్య గుర్తు చేశారు. చూపరుల కంట తడిపెట్టించారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మను హిందూ ధర్మం ప్రకారం కాలం చేసిన 11వ రోజున నిర్వహించారు. మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు తరలి వెళ్లారు.

అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి పెదకర్మ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ముఖ్యంగా భార్య, కూతురు గౌతమ్ రెడ్డి ఫోటో దగ్గర విషాదవదనంలో కనిపించారు. కూతురు సాయి అనన్య తండ్రిపై ప్రేమను గుర్తు చేసుకుంటూ.. తానూ ధరించే డ్రెస్ పై తండ్రి పేరుని డిజైన్ చేయించుకుంది. తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును చున్నీ అంచుకు బోర్డర్ లా ఎంబ్రాయిడరీ చేయించుకుంది. తన తండ్రి బౌతికంగా ఈరోజు తమను వదిలి వెళ్లిపోయారు.. కానీ తన జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ తండ్రి తనతో ఉంటాడని.. తండ్రిపై తనకు ఉన్న ప్రేమను అనన్య చెప్పకనే చెప్పింది.

Also Read:

వివాహానికి అడ్డంకులు వస్తుంటే.. ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి.. త్వరలో వివాహ యోగం కలుగుతుంది