Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు చైర్మన్ సుబ్బారెడ్డి శుభవార్త.. ఆ సేవల ధరల పెంపు ఆలోచన లేదని స్పష్టీకరణ

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమ‌ల‌ శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ని దర్శించుకోవాలనుకునే భక్తులకు త్వరలో టీటీడీ(TTD) బోర్డు షాక్ అంటూ గత కొన్ని రోజులుగా..

Tirumala: శ్రీవారి భక్తులకు చైర్మన్ సుబ్బారెడ్డి శుభవార్త.. ఆ సేవల ధరల పెంపు ఆలోచన లేదని స్పష్టీకరణ
Ttd Yv Subbareddy
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2022 | 12:55 PM

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమ‌ల‌ శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ని దర్శించుకోవాలనుకునే భక్తులకు త్వరలో టీటీడీ(TTD) బోర్డు షాక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా టీటీడీ చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. ఆర్జిత సేవ‌ల ధ‌ర‌ల పెంపుపై టీటీడీ చైర్మ‌న్ క్లారిటీ ఇచ్చారు. తిరుమ‌ల‌లో ఏ సేవ‌ల‌కు ధ‌ర‌లు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆర్జిత సేవలను ఏప్రిల్ 1 నుండి  పున‌రుద్ధ‌రిస్తామని చెప్పారు. వారాంతాల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేయ‌డంతో సామాన్య భ‌క్తులు సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకుంటున్నారని చెప్పారు సుబ్బారెడ్డి.  దీంతో సామాన్య భ‌క్తుల‌ ద‌ర్శ‌నాలను దృష్టిలో పెట్టుకుని సిఫార్సులు త‌గ్గించేందుకు బోర్డు లో చ‌ర్చించాం .. ధ‌ర‌ల పెంపుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదని చెప్పారు.  అంతేకాకుండా ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని ఆయన స్పష్ట చేశారు

అంతేకాదు రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని.. దీంతో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అన్నప్రసాదం విషయంలో ఎటువంటి లోటు రానివ్వమని ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారి అన్నప్రసాదాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు తిరుమ‌ల‌లో హోట‌ళ్ల తొల‌గింపుపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీకి భ‌క్తులంద‌రికీ ఉచితంగా అన్నప్ర‌సాదం అందించాల‌నే ఆలోచన మాత్రమే ఉందని.. అయితే ఆ ఆలోచ‌న‌ను ఇప్పటికిప్పుడు అమ‌లు చేయ‌డంలేదని చెప్పారు., ప్రస్తుతం తిరుమ‌ల‌లోని ఫాస్ట్ ఫుడ్ లు, హోట‌ళ్లు య‌థావిధిగా న‌డుస్తాయని చెప్పారు. తిరుమ‌ల‌లో ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా హోట‌ళ్ల తొల‌గింపుపై నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే  తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి చెప్పారు.

Also Read:

వివాహానికి అడ్డంకులు వస్తుంటే.. ఈ వాస్తు చిట్కాలు ప్రయత్నించండి.. త్వరలో వివాహ యోగం కలుగుతుంది

Father-Daughter Love: నాన్నకు ప్రేమతో.. తండ్రి పేరుని డ్రస్‌పై డిజైన్ చేయించుకున్న గౌతమ్ రెడ్డి కుమార్తె అనన్య

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..