పేరెంట్స్‌ బీకేర్‌‌ఫుల్‌.. బాలుడి ప్రాణాలు తీసిన కరెంట్ వైర్లు.. వీడియో చూస్తే తట్టుకోలేరు..

పిల్లలను బయటకు పంపాలంటే భయం...ఎక్కడ ఏ మ్యాన్‌ హోల్‌ ఉంటుందోనని.. పిల్లలను బయటకు పంపాలంటే వణుకు ఎక్కడ ఏ కరెంట్‌ తీగ ప్రాణం తీస్తుందోనని.. పిల్లలను ఒంటరిగా బయటకు వదలాలంటూ భయం...ఎక్కడ ఏ వీధికుక్క దాడి చేస్తుందోనని... సో.. పేరెంట్స్‌ బీకేర్‌ ఫుల్‌!..

పేరెంట్స్‌ బీకేర్‌‌ఫుల్‌.. బాలుడి ప్రాణాలు తీసిన కరెంట్ వైర్లు.. వీడియో చూస్తే తట్టుకోలేరు..
AP Crime News
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 21, 2024 | 5:05 PM

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారుల నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని ఓ బాబుని చంపేసింది.. మరో బాబుని చావుకు దగ్గర చేసింది.. కావాలంటే ఈ సీన్ చూడండి.. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఎక్కువఅవుతుంది.. చూస్తేనే దడపుడుతోంది.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగా ఓ కుటుంబం తీవ్ర శోకంలో మునిగింది.. ఈ ఘోర ప్రమాదం.. కడప నగరంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.. వీధిలో విద్యుత్‌ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన్వీర్‌ (11) అద్నాన్.. ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు.. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లారు.. ఆ తర్వాత లంచ్ బ్రేక్ కి ఇంటికి వెళ్లారు.. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్‌ చేసి సైకిల్ పై స్కూల్‌కి వెళ్తున్నారు. కరెక్ట్‌గా వీధి టర్నింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మార్‌ నుంచి కరెంట్‌ వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. యమపాశాల్లా వేలాడుతున్న కరెంట్ వైర్లను సైకిల్‌పై వెళ్తున్న ఆ చిన్నారులను తాకాయి.. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. తన్వీర్ ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు… మరొకరు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండంగా.. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బాబు ప్రాణాలు తీసిందని.. స్థానికులు ఆందోళనకు దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.. ఈ దృశ్యం డైరెక్ట్‌గా చూపించలేం.. చూపించినా మీరు తట్టుకోలేరు. అంత దారుణ దృశ్యం. ఇద్దరు పిల్లలు ఎగిరిపడ్డారు. కరెంట్ ఒంట్లోకి ఏ స్థాయిలో సప్లై అయ్యిందోగానీ.. పిల్లలు ఇద్దరు భగభగమండిపోయారు. వీళ్లలో ఒకరు అక్కడిక్కకడే చనిపోగా.. మరోబాబు మాత్రం భరించలేనంతగా గాయపడి ఆస్పత్రిపాలై విలవిలలాడుతున్నాడు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాబు ప్రాణాన్ని తీసిందెవరు? ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పేదెవరు?.. అంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

వీడియో చూడండి..

అయితే, కరెంటు స్తంభానికి కట్టి ఉన్న కేబుల్ వైరు.. దానికి సపోర్టుగా వేసిన జియో వైరు రెండు తెగిపడ్డాయి. అది చూసుకోకుండా విద్యార్థులు సైకిల్ పై వెళుతుండగా వెనుక కూర్చున్న విద్యార్థి కాలికి జియో వైరు తాకింది.. దానికి ఉన్న వేరే వైరు డైరెక్ట్ గా ట్రాన్స్ఫారానికి అటాచ్ కావడంతో హై వోల్టేజ్ విద్యుత్ ప్రవహించి వెనుక కూర్చున్న విద్యార్థి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. సైకిల్ తొక్కుతున్న విద్యార్థి కిందపడి కాలికి చేతికి విద్యుద్ఘాతం అయ్యింది.. అతను వికలాంగుడిగా మిగలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే ప్రభుత్వం నుంచి చనిపోయిన విద్యార్థికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఖర్చులు భరాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాలుడి ప్రాణాలు తీసిన కరెంట్ వైర్లు.. వీడియో చూస్తే తట్టుకోలేరు..
బాలుడి ప్రాణాలు తీసిన కరెంట్ వైర్లు.. వీడియో చూస్తే తట్టుకోలేరు..
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?
శని గ్రహ ప్రభావం.. నెలన్నర పాటు ఆ రాశుల వారికి ఐశ్వర్య యోగాలు..!
శని గ్రహ ప్రభావం.. నెలన్నర పాటు ఆ రాశుల వారికి ఐశ్వర్య యోగాలు..!
నూనెలో వేయకుండానే అప్పడాలు వేయించవచ్చు.. ఎలాగంటే..
నూనెలో వేయకుండానే అప్పడాలు వేయించవచ్చు.. ఎలాగంటే..
ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను పరుగులు పెడుతుంది..
ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను పరుగులు పెడుతుంది..
ఇన్‌స్టా రీల్స్‌ నుంచి ప్రభాస్‌కు జోడీగా ఛాన్స్‌ కొట్టేసిన ఇమాన్.
ఇన్‌స్టా రీల్స్‌ నుంచి ప్రభాస్‌కు జోడీగా ఛాన్స్‌ కొట్టేసిన ఇమాన్.
దళపతి గోట్ సినిమాలో ధోని.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..
దళపతి గోట్ సినిమాలో ధోని.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..
ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి..స్కానింగ్‌ రిపోర్ట్‌
ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి..స్కానింగ్‌ రిపోర్ట్‌
ఐపీఎల్‌ మెగా వేలంలోకి అడుగుపెట్టనున్న ద్రవిడ్‌ కుమారుడు..?
ఐపీఎల్‌ మెగా వేలంలోకి అడుగుపెట్టనున్న ద్రవిడ్‌ కుమారుడు..?
పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి ముహూర్తం ఖరారు.. జాతరకు ఏర్పాట్లు..
పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి ముహూర్తం ఖరారు.. జాతరకు ఏర్పాట్లు..