మహారాజ భవనమా…? మైసూర్ పేలస్సా..? ఆ ఇంటి చుట్టూనే దువ్వాడ ఫ్యామెలీ డ్రామా ఎందుకు తిరుగుతోంది?
మొదట భార్యాభర్త పంచాయితీ అనుకున్నారు. ఆ తర్వాత మాధురి ఎంట్రీతో...పతి పత్ని ఔర్ ఓ అనుకున్నారు. సీరియల్ ముదురు పాకాన పడ్డాక.. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ మొదలైంది.

వార్తల కోసం వాచిపోతున్న మీడియాకు… బాగా ఆకలి మీదున్న వ్యక్తికి బిర్యాని దొరికినట్టు… ఎక్కడో సిక్కోలు జిల్లాలో ఒడిషా బోర్డర్‌కు దగ్గర్లో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ గెలుపు ముఖం చూడని… పార్టీని నమ్ముకున్నందుకు ఎమ్మెల్సీ హోదాలో ఉన్న ఓ వీఐపీ ఫ్యామెలీ ఎపిసోడ్ దొరికేసింది. అంతే… మొత్తం తెలుగు మీడియా అంతా అక్కడే వాలిపోయింది. ఒకప్పుడైతే.. కేవలం టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటికి పోటీగా యూట్యూబ్ ఛానెళ్లొచ్చాక… పాపం దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం ప్రతి ఇంట్లో ఓ కార్తీక దీపం సీరియల్ రేంజ్ ఇమేజ్ తెచ్చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ ఫ్యామెలీ మెంబర్లంతా పోటా పోటీగా మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తిట్టుకుంటూ… లైవ్‌ల మీద లైవ్ అడిగిన ఛానెళ్లకు.. అడగని ఛానెళ్లకు.. పిలిచి మరీ ఇస్తూ ఉండేసరికి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనం టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ మొదట భార్యా భర్త పంచాయితీ అనుకున్నారు. ఆ తర్వాత మాధురి ఎంట్రీతో…పతి పత్ని ఔర్ ఓ అనుకున్నారు. సీరియల్ ముదురు పాకాన పడ్డాక.. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ మొదలైంది. ఆ తర్వాత భార్య వాణి, తన కుమార్తెతో కలిసి ఏకంగా దువ్వాడ శ్రీను ఇంటి ముందే కారు షెడ్లో నిరసన పేరుతో రోజుల తరబడి అక్కడే ఉన్నారు. తన భర్తను .. మాధురి అనే మహిళ తమకు...
