AP News: పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా కళ్లు బైర్లు
గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు 'పుష్ప' క్రియేటివిటీని చూపిస్తూ.. రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా..
గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు ‘పుష్ప’ క్రియేటివిటీని చూపిస్తూ.. రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారిని పక్కా ప్రూఫ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సాధారణ వెహికిల్ చెకింగ్ చేస్తోన్న ఖాకీలకు.. పూతరేకుల పార్శిళ్లల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. కొవ్వూరు గ్యారేజ్‌లోని ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు ఈ గంజాయిని గత కొద్దిరోజులుగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఈ దందాలో ప్రధాన వ్యక్తైన వైజాగ్‌కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా కూడా విశాఖ నుంచి పూతరేకుల కొరియర్ ద్వారా గంజాయిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని.. స్దానికంగా ఎర్రగుంట్లకు చెంది వ్యక్తులతో విక్రయిస్తున్నారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

