APPSC Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. గత కొంత కాలంగా అభ్యర్ధులు మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో గ్రూప్‌ 1 పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో నోటిఫికేషన్‌ నంబరు:12/2023లు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి..

APPSC Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీ ప్రకటన
APPSC Group 1 Mains Postponed
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2024 | 7:25 PM

అమరావతి, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. గత కొంత కాలంగా అభ్యర్ధులు మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో గ్రూప్‌ 1 పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో నోటిఫికేషన్‌ నంబరు 12/2023లు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్ష సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటం మరో కారణం. ఈ క్రమంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహించేందుకు కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఏప్రిల్‌ 12వ తేదీన విడుదలయ్యాయి. గ్రూప్‌ 1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు. అయితే ఫలితాల్లో మాత్రం 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అనుమతించారు. దీంతో 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని గత కొంతకాలంగా అభ్యర్ధులతో పాటు నేతలు డిమాండ్‌ చేయసాగారు. కాగా మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు ముందుగా నిర్ణయించినా… తాజాగా మెయిన్స్ వాయిదా వేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం ఇలా..

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారే మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో రెండు క్వాలిఫైయింగ్ పేపర్లతో పాటు ఐదు మెరిట్ పేపర్లతో కలిపి మొత్తం 7 పేపర్లకు పరీక్ష ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్లలో ఇంగ్లీష్, తెలుగు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ ఎస్సేలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రెండో పేపర్ భారత దేశ చరిత్రకు, మూడో పేపర్ భారత రాజ్యంగం, గవర్నెర్స్‌కు, నాల్గో పేపర్ ఆర్థిక వ్యవస్థకు, ఐదో పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లీష్ , తెలుగు పేపర్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మిగతా ఐదు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంతా మెరిట్‌ లిస్ట్‌ తీస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.