AP Politics: పిఠాపురం కేంద్రంగా వేడెక్కుతున్న కాపు రాజకీయం
ఏపీలో ఎన్నికల హీట్ పతాకస్థాయికి చేరింది. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేయబోతున్న పిఠాపురం వేదికలు మంటలు రాజుకుంటున్నాయి. అటు తన ప్రత్యర్థి వంగా గీతని ఏకంగా జనసేనలోకి పవన్ ఆహ్వానించడం చర్చనీయాంశం అయింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం కాకరేపుతోంది. ఈ పొలిటికల్ వేడికి.. ప్రధానంగా కాపులే కేంద్రబిందువుగా మారుతున్నారు. పోటాపోటీ చేరికలతో అటు కూటమిపక్షం… ఇటు అధికారపక్షం… దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కాపు నాయకుల్ని తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పోటీచేస్తానని ప్రకటించడంతో.. ఇప్పుడు కాపురాజకీయమంతా పిఠాపురంలో కేంద్రీకృతమైంది.
అమిత్ షా, మోదీ ఆదేశాల మేరకు… తాను కాకినాడ ఎంపీగానూ పోటీచేసే అవకాశం ఉందన్నారు పవన్ కల్యాణ్. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ పోటీ చేయాలంటే చంద్రబాబో మరొకరో టిక్కు పెట్టాలంటూ ఎద్దేవా చేస్తున్నారు.
పిఠాపురంలో గెలుపు కాదు… తనకు లక్ష మెజారిటీ రావాలన్న పవన్ వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటరిచ్చింది వైసీపీ. పవన్‌కు సొంత సామాజికవర్గం ఓట్లే పడవనీ.. ఆయన్ని ఎవరూ నమ్మరనీ వ్యాఖ్యానించింది.