Andhra Pradesh Politics: మూడు స్తంభాలాట.. ఏపీ పాలిటిక్స్‌లో ఎవరు ఎవరికి తోడు? కొనసాగుతున్న సస్పెన్స్..
ఎన్నికలపై కేంద్రం నుంచి సంకేతాలున్నాయి.. సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా రెండుమూడు వారాలు ముందుగానే షెడ్యూల్ వస్తుందని మంత్రులను అలర్ట్ చేశారు. దీంతో విపక్షాలు సైతం కసరత్తు మొదలుపెట్టాయి. ఇంతకాలం చంద్రబాబు ఇంటికే పవన్ వెళ్లి చర్చలు చేయగా.. కొత్తగా జనసేన అధినేత ఇంటికే టీడీపీ బాస్ వెళ్లి మరీ మంత్రాంగం జరిపారు.

ఎన్నికలపై కేంద్రం నుంచి సంకేతాలున్నాయి.. సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా రెండుమూడు వారాలు ముందుగానే షెడ్యూల్ వస్తుందని మంత్రులను అలర్ట్ చేశారు. దీంతో విపక్షాలు సైతం కసరత్తు మొదలుపెట్టాయి. ఇంతకాలం చంద్రబాబు ఇంటికే పవన్ వెళ్లి చర్చలు చేయగా.. కొత్తగా జనసేన అధినేత ఇంటికే టీడీపీ బాస్ వెళ్లి మరీ మంత్రాంగం జరిపారు. ఇద్దరూ సరే మరి మూడో పార్టీ బీజేపీ సంగతేంటన్న చర్చ ఏపీ రాజకీయాల్లో రచ్చరచ్చగా మారింది. మరోవైపు మిత్రపక్షాల మధ్య గ్యాప్ ఉందని అధికారపార్టీ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. గతంలో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లినా లైట్‌గా తీసుకున్నా.. లేటెస్ట్ ఎపిసోడ్‌ను మాత్రం బూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు. భేటి వెనక బోలెడు అంశాలున్నాయని తెలుగుదేశం అంటుంటే.. ప్యాకేజీ లెక్కలు తప్ప ఇంకెముంటాయని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ.. టీడీపీ – జనసేన మధ్య తేడాలొచ్చాయని.. బతిమాలేందకు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారంటోంది వైసీపీ.. ఇద్దరు నేతలు కలిస్తే వైసీపీకి టెన్షన్ ఎందుకని ప్రశ్నించారు టీడీపీ నాయకులు.
టీడీపీ- జనసేన మధ్య మ్యానిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే.. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పదేపదే చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
టీడీపీతో కనీసం దశాబ్దం అయినా దీర్ఘకాలిక పొత్తు ఉంటుందని పవన్ చెబుతున్నారు. బీజేపీ కూడా కలిసివస్తుందని జనసేన కేడర్ అంటున్నా.. కాషాయం పెద్దలు మాత్రం నో కామెంట్ అంటున్నారు. ఇదే ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతోంది. మరి పదేళ్ల తర్వాత విశాఖలో ఒకే వేదికపైకి వస్తున్న చంద్రబాబు-పవన్ పొత్తులు.. ఎత్తులు.. హామీలపై క్లారిటీ ఇస్తారా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..