AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కూటమి బంపర్‌ విక్టరీలో బ్యాక్‌బోన్‌గా నిలిచిందెవరు? వైసీపీని ఓడించిన విధానాలేంటి?

బంపర్‌ విక్టరీ కొట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటుంటే.. ఘోర ఓటమిపై వైసీపీ పోస్ట్‌మార్టమ్‌లో పడింది. గెలవకపోయినా గట్టి పోటీ అయినా ఇస్తుందని భావించిన నేతలు అసలేం జరిగిందన్న కోణంలో విశ్లేషణ మొదలుపెట్టారు. అటు అందుబాటులో ఉన్న నేతలతో చర్చించిన జగన్మోహన్‌రెడ్డి కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Andhra Pradesh: కూటమి బంపర్‌ విక్టరీలో బ్యాక్‌బోన్‌గా నిలిచిందెవరు? వైసీపీని ఓడించిన విధానాలేంటి?
Ap Politics
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2024 | 7:01 PM

Share

బంపర్‌ విక్టరీ కొట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటుంటే.. ఘోర ఓటమిపై వైసీపీ పోస్ట్‌మార్టమ్‌లో పడింది. గెలవకపోయినా గట్టి పోటీ అయినా ఇస్తుందని భావించిన నేతలు అసలేం జరిగిందన్న కోణంలో విశ్లేషణ మొదలుపెట్టారు. అటు అందుబాటులో ఉన్న నేతలతో చర్చించిన జగన్మోహన్‌రెడ్డి కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఓటమిపై పోస్టుమార్టం మొదలెట్టిన వైసీపీ.. ఇంతటి పరాభవానికి గల కారణాలపై లోతుగా విశ్లేషిస్తోంది. జగన్‌తో జరిగిన భేటీలో ఓటమిపై వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంక్షేమం అందుకున్న లబ్ధిదారుల ఓట్లు కూడా ఎందుకు పడలేదన్న చర్చ వారి మధ్య ఎక్కువగా జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షల కోట్లతో డీబీటీ ద్వారా సంక్షేమం అందించినా ప్రజల మద్దతు లభించకపోవడంపై పార్టీలోనూ కేడర్‌లోనూ విస్త్రతంగా చర్చ జరుగుతోంది. ఇక కోటరీ, వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఈవీఎం ట్యాంపిరింగ్‌ అంటూ రకరకాల్లో కోణాల్లోనూ నేతలు తమ స్వరాలు వినిపిస్తున్నారు. SPOT ప్రజలకు మంచి చేశామని గర్వంగా చెప్పుకుంటామని.. అయితే కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజా కోర్టులో నిలదీస్తామంటున్నారు వైసీపీ నేతలు.

ఘోరంగా ఓడిపోయినా ఇంకా వైసీపీలో మార్పు రాలేదంటోంది కూటమి. ఓటమికి కారణం ప్రజలే అంటూ నిందించడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ చూడండి..

మరోవైపు అప్పుడే ఆపరేషన్‌ ఆకర్ష్‌పై రచ్చకు కూటమి తెరలేపింది. జగన్‌ తప్ప వైసీపీలో గెలిచిన వాళ్లంతా తమతో టచ్‌లో ఉన్నారంటోంది బీజేపీ. పార్టీ నాయకత్వం ఒప్పుకుంటే అరగంటలో బీజేపీకి క్యూ కడతారన్నారు.

మొత్తానికి ఏపీలో విజయంతో కూటమి భవిష్యత్తు ప్రణాళికలపై ఫోకస్‌ పెడితే.. ఓటమిని విశ్లేషించుకుని భవిష్యత్తులో పూర్వవైభవం కోసం ఏం చేయాలన్న దానిపై వైసీపీ మేథోమథనం చేస్తోంది. ఇంతకీ గెలుపోటములు ధైవాధీనమా? స్వయంకృతమా? ఇదే ఇప్పుడు తేలాలి.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా