AP News: వైసీపీపై టీడీపీ దాడులకు దిగుతోంది.. గవర్నర్‌కు పేర్ని నాని ఫిర్యాదు
ఏపీలో పోలింగ్ రోజున మొదలైన రచ్చ.. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం.. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం.. ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని మార్చేసింది. అధికారంలోకి వచ్చీరాగానే తమపై టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ..
ఏపీలో పోలింగ్ రోజున మొదలైన రచ్చ.. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం.. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం.. ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని మార్చేసింది. అధికారంలోకి వచ్చీరాగానే తమపై టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
వైసీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులు నిర్వహిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ మరిన్ని దాడులకు దిగుతోందని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ దాడులను అరికట్టాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులకు దిగుతోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తమ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకుంటారనీ కూటమినేతలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే వైసీపీ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు కూటమి నేతలు. ఓటమితో వచ్చిన ఫ్రస్టేషన్‌లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. దాడుల సంస్కృతి వైసీపీదేనని బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మరి, ఈ దాడులు, ప్రతిదాడులతో ముదురుతున్న పొలిటికల్ వేడి.. ఇంకే స్థాయికి చేరుకుంటుందో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి