AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: బొబ్బిలి యుద్దంలో వాడిన ఆయుధాలు ఇవే..

బొబ్బిలి చరిత్రను భావితరాలకు అందించే నేపథ్యంలో కోటలోని దర్బార్ మహల్‌లో మ్యూజియం ఏర్పాటు చేసి రాజులు వాడిన అన్ని వస్తువులను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అలా ఉంచిన ఆ వస్తువులను ప్రతి విజయదశమికి బయటకు తీసి శుభ్రపరిచి ఆయుధాలకు ఆయుధ పూజ చేస్తారు.

Vizianagaram: బొబ్బిలి యుద్దంలో వాడిన ఆయుధాలు ఇవే..
Bobbili War Weapons
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 4:18 PM

Share

వందల ఏళ్లు గడిచినా నేటికీ చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధం గురించి గొప్పగా చెబుతూనే ఉంటారు. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగింది. ఆ యుద్ధంలో బొబ్బిలి సంస్థానం పూర్తిగా నష్టపోయింది. మహరాణులు సైతం ఆత్మార్పణ చేసుకున్నారు. సైనికులు వీరోచితంగా పోరాడి గజపతిరాజుల సేన దాడిలో ప్రాణాలు వదిలారు. బొబ్బిలి కోట సైతం ఫిరంగుల ధాటికి కుప్పకూలి పోయింది. ఆ యుద్ధంలో బొబ్బిలి రాజులతో పాటు విజయనగర సంస్థాన యోధులు కూడా ప్రాణాలు వదిలారు. నాడు జరిగిన బొబ్బిలి యుద్ధం బొబ్బిలి వీరుల శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా నిలుస్తుంది. అనంతరం బొబ్బిలి రాజవంశీయులు తిరిగి తమ సంస్థానాన్ని పునర్నిర్మించుకున్నారు. ఆ తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు బొబ్బిలి రాజులు బొబ్బిలి ప్రాంతాన్ని పాలించారు. నాడు బొబ్బిలిని పాలించిన సమయంలో రాజులు వాడిన తుపాకీలు, బడిసెలు, విల్లులు, కత్తులు, పదునైన ఆయుధాలతో పాటు రాజులు ఉపయోగించిన సింహాసనం, విదేశాల నుండి తెప్పించిన పరికరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా బొబ్బిలి కోటలో దర్శనమిస్తాయి.

బొబ్బిలి చరిత్రను భావితరాలకు అందించే నేపథ్యంలో కోటలోని దర్బార్ మహల్‌లో మ్యూజియం ఏర్పాటు చేసి రాజులు వాడిన అన్ని వస్తువులను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అలా ఉంచిన ఆ వస్తువులను ప్రతి విజయదశమికి బయటకు తీసి శుభ్రపరిచి ఆయుధాలకు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ చేసేందుకు బొబ్బిలి రాజవంశీయుల వారసులైన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరులు రామ్ నాయన, ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయనలు నాడు రాజులు ధరించిన వస్త్రాధరణను సంప్రదాయంగా ధరించి, వజ్రాలు పొదిగిన కత్తులు పూని సిద్ధమవుతారు. వారితో నాటి సైనికుల వారసులు కూడా సైనిక వస్త్రధారణతో రాజవంశీయులతో కలిసి కవాతు చేస్తారు. అందరూ ఆయుధాలు ధరించి బొబ్బిలి కోటలో కవాతు చేస్తుంటే నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని స్థానికులు భావోద్వేగానికి గురవుతుంటారు. గగ్గుర్పాటుకు గురి చేసే ఆయుధాలు అందరినీ కనువిందు చేస్తాయి. అనంతరం సింహాసనం మీద ప్రస్తుత రాజుల తండ్రి అయిన రావు వెంకట గోపాలకృష్ణ రంగారావు చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఆయుధ పూజను చూసేందుకు స్థానికులు బొబ్బిలి కోటకు వేలాధిగా తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించి తమ ఆనందం వ్యక్తం చేశారు.

Bobbili Samsthanam

Bobbili Samsthanam

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.