Andhra: ఇంటికి వెళ్తుండగా ఆటోడ్రైవర్‌కు కనిపించిన నల్లటి బ్యాగ్.. ఓపెన్ చేయగా
ఓ ఆటో డ్రైవర్.. కొంతమంది ప్యాసింజర్లను రైల్వే స్టేషన్‌లో దింపేసి.. ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇక తిరిగి వచ్చే క్రమంలో అతడి ఆటో వెనుక సీట్‌లో ఓ నల్లటి బ్యాగ్ కనిపించింది. అదేంటి అని చూడగా.. అందులో కనిపించినవి చూసి దెబ్బకు షాక్ అయ్యాడు.

రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వందో, యాభై రూపాయలు దొరికితేనే తీసుకుని జేబులో పెట్టుకుంటాం. అలాంటిది ఏకంగా 12 తులాల బంగారం దొరికినా.. తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్నాడు ఆ ఆటో డ్రైవర్. తులం బంగారం లక్ష రూపాయలు దాటినా ఈ రోజుల్లో కూడా ఇంకా నిజాయితీపరులు ఉన్నారా.? అనిపిస్తుంది ఈ సంఘటన చూశాక.. నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనంతపురం పట్టణం వచ్చారు. వివాహ కార్యక్రమం అయిపోయాక మారుతీ నగర్ నుంచి బస్టాండుకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకున్నారు సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు. ఆటోలో బస్టాండుకు బయలుదేరి వెళ్లిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు.. బస్టాండ్‌లో దిగి.. బస్సు ఎక్కే హడావుడిలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ మర్చిపోయారు.
బస్సు ఎక్కే హడావుడిలో ఆభరణాలు ఉన్న సూట్‌కేస్ మర్చిపోయి సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు నంద్యాలకు వెళ్లిపోయారు. తర్వాత ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ తన ఆటోలో సూట్ కేస్ గమనించి.. తన ఆటోలో ప్రయాణించిన ప్యాసింజర్లు సూట్‌కేసును మర్చిపోయారని.. వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సూట్ కేస్ అప్పగించాడు. సూట్ కేస్ ఓపెన్ చేసిన పోలీసులకు.. అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా బాధితులు సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులకు పోలీసులు ఫోన్ చేశారు. తాము పోగొట్టుకున్న బంగారు ఆభరణాల బ్యాగు పోలీస్ స్టేషన్‌లో ఉందని తెలుసుకుని ఆ దంపతులు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
12 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌ను మెచ్చుకున్న పోలీసులు సన్మానించారు. సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులకు డిఎస్పి శ్రీనివాసులు బంగారు ఆభరణాలను అందజేశారు. ఆటోడ్రైవర్ చంద్రశేఖర్ నిజాయితీకి బాధితులు సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు కూడా ఆర్థిక సాయం చేసి నిజాయితీని మెచ్చుకున్నారు. 12 తులాల బంగారం అంటే దాదాపు 12 లక్షల రూపాయల విలువ ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ నిజాయితీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.
