AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోయిన సెల్‌ఫోన్ కోసం వెళ్ళి మానం పోగొట్టుకున్న ఆశా వర్కర్.. చివరికి ప్రాణమే!

పోయిన సెల్‌ఫోన్ వెతికి తెస్తామంటూ ఉచ్చు పన్నారు. వారి మాటల నమ్మి వెళ్లిన ఆశా వర్కర్‌పై కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా హతమార్చారు. అనంతరం ఆధారాలు లేకుండా మాయం చేశారు. అయితే పోలీసులు పకడ్బందీగా జరిపిన దర్యాప్తులో ముగ్గురు నిందితులు దొరికిపోయారు.

పోయిన సెల్‌ఫోన్ కోసం వెళ్ళి మానం పోగొట్టుకున్న ఆశా వర్కర్.. చివరికి ప్రాణమే!
Three Accused Jailed
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 04, 2025 | 6:47 PM

Share

పోయిన సెల్‌ఫోన్ వెతికి తెస్తామంటూ ఉచ్చు పన్నారు. వారి మాటల నమ్మి వెళ్లిన ఆశా వర్కర్‌పై కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా హతమార్చారు. అనంతరం ఆధారాలు లేకుండా మాయం చేశారు. అయితే పోలీసులు పకడ్బందీగా జరిపిన దర్యాప్తులో ముగ్గురు నిందితులు దొరికిపోయారు. కోర్టు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

మూడేళ్ల క్రితం.. అనుపు చెంచు కాలనీకి చెందిన ఆశా వర్కర్ తన సెల్‌ఫోన్ పొగొట్టుకుంది. ఫోన్ కోసం వెతుకులాడుకుంటూ అదే గ్రామానికి చెందిన ముత్తయ్య వద్దకు వెళ్లింది. తనకు సాయం చేయమని అడిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న శీలం అంజి, సావిటి చిన అంజి, శీలం బైస్వామిలు తమకు తెలిసిన వ్యక్తి వద్దకు వెలితే అతను సెల్ ఫోన్ ఎక్కడుందో చెప్పగలడంటూ ఆమెను నమ్మించారు. వారి మాటలు నిజమనుకుని.. వారితో కలిసి వెళ్లింది.

గ్రామం నుండి కొంతదూరం తీసుకెళ్లిన ముగ్గురు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను అక్కడే హతమార్చారు. ఆమె హత్యకు ఉపయోగించిన బండరాయిని మాయం చేసి అక్కడ నుండి జారుకున్నారు. గ్రామంలో ఆశా వర్కర్ హత్య స్థానికంగా తీవ్రం సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్‌గా తీసుకుని ఛేదించారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాయ మాలతో ఆమెను నమ్మించి, తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

మూడేళ్లుగా విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా సంచలన తీర్పు నిచ్చింది. ఈ ముగ్గరికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికి డెబ్బై వేల రూపాయల జరిమానా కూడా విధించారు. రెండు లక్షల పది వేల రూపాయలను బాధితురాలి కుటుంబానికి అప్పగించాలని సూచించారు. మహిళను హత్య చేసిన ముగ్గురిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా, దర్యాప్తు అధికారిగా ఉన్న రవిచంద్ర అన్ని ఆధారాలు సేకరించడంతో నిందితులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చేయగలిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లపు కృష్ణ చెప్పారు. అటు పోలీసులు ఇటు న్యాయ వాదులు అందరూ కలిసికట్టుగా పని చేసి నిందితులకు శిక్ష పడేలా చేయగలిగామన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి