Congress: ఓటమికి కారణం అదే.. అందుకే మాకు ఓటు వేయలేదు: వైఎస్ షర్మిల..

రాహుల్ గాంధీ దెబ్బకి ఎన్నికల్లో బిజేపి చతికిల పడిందన్నారు వైఎస్ షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న పేరు తప్ప.. బీజేపీ చేతిలో పవర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని.. ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పుకోసం ఓటు వేశారన్నారు. ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న మేరకు పర్ఫాం చేయలేకపోయిందన్నారు.

Congress: ఓటమికి కారణం అదే.. అందుకే మాకు ఓటు వేయలేదు: వైఎస్ షర్మిల..
Ys Sharmila
Follow us

|

Updated on: Jun 19, 2024 | 6:25 PM

రాహుల్ గాంధీ దెబ్బకి ఎన్నికల్లో బిజేపి చతికిల పడిందన్నారు వైఎస్ షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న పేరు తప్ప.. బీజేపీ చేతిలో పవర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని.. ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పుకోసం ఓటు వేశారన్నారు. ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న మేరకు పర్ఫాం చేయలేకపోయిందన్నారు. ఓ సర్వేలో కాంగ్రెస్‎కు 7 శాతం ఓటింగ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఓటు చీలకూడదని, వృధా కాకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‎కు ఓటు వేయలేదన్నారు. రాష్ర్టంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, ఒత్తిడి తేవాలని సూచించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ తన మాట నిలుపుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు 2018నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజక్ట్‎పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. తన ఓటమికి కారణం సమయం లేకపోవడమేనని వైఎస్ షర్మిల చెప్పారు. కేవలం 14 రోజులు మాత్రమే ఎన్నికల్లో ప్రచారం చేశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుందని కడపలో చాలా మందికి తెలియదన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. అప్పట్లో మహా నాయకుడు చనిపోతే ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెస్ట్‌ ప్లాన్‌..రూ.94తో 30 రోజుల చెల్లుబాటు.. బెనిఫిట్స్‌ ఇవే!
బెస్ట్‌ ప్లాన్‌..రూ.94తో 30 రోజుల చెల్లుబాటు.. బెనిఫిట్స్‌ ఇవే!
జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..
జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..
ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..