ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలి కోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప లభ్యం కావడంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. క్రేన్ సాయంతో కుంభాభిషేకం రేవుకు భారీ చెపను తరలించారు. మత్స్యకారులు వేలం పాట నిర్వహించగా రూ.36 వేలు ధర పలికింది. చేపల వేట విరామం అనంతరం భారీ చేపలు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..
Kakinada Sea
Follow us
Pvv Satyanarayana

| Edited By: Srikar T

Updated on: Jun 19, 2024 | 6:47 PM

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలి కోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప లభ్యం కావడంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. క్రేన్ సాయంతో కుంభాభిషేకం రేవుకు భారీ చెపను తరలించారు. మత్స్యకారులు వేలం పాట నిర్వహించగా రూ.36 వేలు ధర పలికింది. చేపల వేట విరామం అనంతరం భారీ చేపలు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి చేపలు లభ్యమయ్యాయి. ఇవి అరుదైన జాతి కనుక వీటిని వేలల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటి రుచి కూడా బాగుంటుందని చెబుతున్నారు స్థానికులు.

Kakinada Sea

Kakinada Sea

సముద్ర తీరం నుంచి చాలా దూరంగా వెళ్తే తప్ప చిక్కని ఈ చేపలు గేలాలకు మాత్రమే పడతాయి. ఈ కొమ్ముకోనెం చేపలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదని చాలా కష్టపడితే తమ గేలానికి చిక్కుతాయంటున్నారు మత్స్యకారులు. వీటి ముందుభాగంలో ఇనుప చువ్వలాంటి కొమ్ము ఉంటుంది. చేప సైజ్ ఎంత ఉంటుందో దాదాపుగా అంతే పరిమాణంలో ఈ కొమ్ము కూడా ఉంటుంది. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కొమ్ముతో వాళ్లపై దారుణంగా దాడి చేస్తాయి. ఈ చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి మరణాలు తీర ప్రాంతంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇక ఈ చేపల పరిమాణం, బరువు విషయానికి వస్తే.. ఒక్కో చేప సగటున 20 నుంచి 350 కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. తాజాగా దొరికిన చేప 300 కేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని ఒడ్డుకు తీసుకెళ్లేందుకు భారీ క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఈ చేపలు తీరం నుంచి సుమారు ఆరేడు నాటికన్ మైళ్లు దాటిన తర్వాతే కనబడతాయి. ఒకే ప్రదేశంలో గుంపులుగా తిరుగుతుంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..