AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఏపీ వాసులకు అలెర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం.. రేపటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు-వరదలతో అతలాకతలం అయిన రాష్ట్రం  తాజాగా పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పుతో అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.

Weather Report: ఏపీ వాసులకు అలెర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం.. రేపటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..
రెడ్ అలర్ట్: తిరుపతి, నెల్లూరు.. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్: చిత్తూరు, అనంతపురం.. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ : ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం.. ఆయా జిల్లాల్లో భారీ వర్ష సూచన.. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్: నెల్లూరు చిత్తూరు, కడప
Surya Kala
|

Updated on: Oct 13, 2024 | 12:18 PM

Share

ఆంద్రప్రదేశ్ వాసులకు అలర్ట్. మరో తుఫాన్ గండం తరుముకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఎప్పుడైనా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపటి (అక్టోబర్ 14వ తేదీ) నుంచి  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజా గా హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటిడిప్పుడే తీవ్ర వర్షాలు సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజలు తాజా వార్నింగ్‌తో మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు.

ఈనెల 15న తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం

ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు-వరదలతో అతలాకతలం అయిన రాష్ట్రం  తాజాగా పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పుతో అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు (14, 15, 16 తేదీల్లో) రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ఈనెల 14న వాయుగుండంగా మారి, 15న తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ఈనెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు

ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, ఏపీ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.

కాలువలు, చెరువుల గట్లపై అధికారుల దృష్టి

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో భారీవర్ష సూచన నేపథ్యంలో అలర్ట్‌ అయిన ప్రభుత్వం, అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది. మరోవైపు బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లపై అధికారులు దృష్టిపెట్టారు. వాటిని పటిష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే వాగులు, వంకలూ పొంగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని నిర్ణయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..