Pashankusha Ekadashi: నేడు పాశాంకుశ ఏకాదశి.. పద్మనాభ రూపంలో విష్ణువుని ఇలా పూజించండి.. ఆయురారోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..
ఆశ్వయుజ మాసంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. ఈ రోజున విధి ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా పాపాలు, దుఃఖాలు నాశనం అవుతాయని విశ్వాసం. పాశాంకుశ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు రూపమైన పద్మనాభ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మనిషి జీవితంలో సంతోషం కలుగుతుంది
ప్రతి నెల కృష్ణ, శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉంటారు. మహా విష్ణువుని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. ఈ రోజున విధి ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా పాపాలు, దుఃఖాలు నాశనం అవుతాయని విశ్వాసం. ఈ ఏడాది ఈ రోజన పాశాంకుశ ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో పాశాంకుశ ఏకాదశి పూజ, శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం..
పాశాంకుశ ఏకాదశి పూజ శుభ సమయం వేద పంచాంగం ప్రకారం పాశాంకుశ ఏకాదశి రోజున పూజ చేయడానికి ఉదయం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది.
పాశాంకుశ ఏకాదశిన చేయాల్సిన పరిహారాలు విష్ణువు ఆరాధనలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే పాశాంకుశ ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్కకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల మహావిష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని పొందుతారు.
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి ఏదైనా పని చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటే పాశాంకుశ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత తూర్పు ముఖంగా భగవద్గీత 11వ అధ్యాయాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్మకం. దీంతో పాటు అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
డబ్బు సంబంధిత సమస్యలు పాశాంకుశ ఏకాదశి రోజున వస్త్రదానం, ఆహారధాన్యాలు, తులసి మొక్కలు, నెమలి ఈకలు, కామధేనువు విగ్రహాన్ని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనితోపాటు కుంకుమ కలిపిన పాలతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది.
వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఎవరినా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా లేదా వ్యాపారంలో పురోగతి ఆగిపోయినట్లయితే ఏకాదశి రోజున విష్ణువు దగ్గర తొమ్మిది ముఖాల దీపాన్ని వెలిగించి.. విష్ణువు లక్ష్మీదేవిని పూజించండి. ఇలా చేయడం వల్ల వృత్తి, వ్యాపారాల్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
వైవాహిక జీవితంలో ఆనందం ఏకాదశి రోజున పాలతో చేసిన బియ్యం పాయసాన్ని తయారు చేసి అందులో తులసి దళం వేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో వివాదాలు దూరమై సంతోషం నెలకొంటుందని నమ్మకం.
పాశాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత పాశాంకుశ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు రూపమైన పద్మనాభ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మనిషి జీవితంలో సంతోషం కలుగుతుంది. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంతానం, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. ఇది కాకుండా జీవితంలో చేసిన అన్ని పాపాలు నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. ఈ ఉపవాస సమయంలో విష్ణు సహస్ర నామం పఠించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి