AP News: చూడముచ్చటగా బొమ్మల కొలువు..ఎక్కడో తెలుసా?
పురాణ, ఇతిహాసాలలోనీ పాత్రలు ఒక్క చోట కొలువు తీరాయి. రామాయణ,మహాభారతంలోని సన్నివేశాలు కండ్లకు కట్టినట్టు దర్శనమిస్తున్నాయి. హిందూ దేవతా మూర్తులు, సనాతన జీవన విధానాలు, జానపదాలు బొమ్మలుగా కొలువుతీరాయి. దసరా సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ నివాసంలో నిర్వహిస్తోన్న బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.

దసరా పండుగ అంటే చెడుపై మంచి సాధించిన విజయంగా పెద్దలు చెబుతారు. మహిసాసురుడనే రాక్షసుడిని సంహరించే సందర్భంలో ముక్కోటి దేవతలు అమ్మ వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఆమెకు మరింత బలాన్ని సమకూరుస్తారట. అందుకే దేవి నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మ వారిని ఆరాధించటంతో పాటు బొమ్మల కొలువు పెట్టి సకల దేవత మూర్తులను ఆరాధిస్తారు. సకల దేవతలను ఆరాధించటం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఈ బొమ్మల కొలువు కొన్ని ఇళ్లల్లో సంప్రదాయకంగా నిర్వహిస్తూ వస్తోంది. అలానే ప్రతి ఏటా శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నివాసంలోను దసరా రోజున కొమ్మల కొలువు పెట్టడం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ.
బొమ్మల కొలువు వీడియో ఇదిగో:
శ్రీకాకుళం అరసవల్లిలోని బ్రాహ్మణ వీధిలో కొలువైన ఈ బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది. సనాతన భారతీయ సాంప్రదాయం మొదలుకొని నేటి ఆధునిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ అనేక బొమ్మలు ఈ బొమ్మల కొలువులో కొలువుతీరాయి. ఈ బొమ్మల కొలువు చిన్నారులను సైతం ఆకట్టుకుంటున్నాయి.