AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు పిడుగులతో భారీ వర్షసూచన

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం (అక్టోబర్ 14) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు పిడుగులతో భారీ వర్షసూచన
Andhra Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 12, 2024 | 7:27 PM

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం (అక్టోబర్ 14) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని వలన రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుండి 55 కి.మీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అలాగే భారీవర్షం పడేప్పుడు బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండకుడదని సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు.వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 64మిమీ, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో 54.7మిమీ, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 47.7మిమీ, ఏలూరు జిల్లా చాట్రాయిలో 39.5మిమీ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 38.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.

ఇవి కూడా చదవండి

13 అక్టోబర్, ఆదివారం :

• అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

14 అక్టోబర్, సోమవారం :

• అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

15 అక్టోబర్, మంగళవారం :

• కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

16 అక్టోబర్, బుధవారం :

• కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..