భక్తులకు డబ్బులు, బంగారం, వజ్రాల నగలు ప్రసాదంగా పంచె ఆలయం.. దీపావళికి పోటెత్తే భక్తులు

బంగారం, వెండిని ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం కారణంగా కూడా ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ భక్తులకు పండ్లు, స్వీట్లు లేదా పంచదార మిఠాయిలకు బదులుగా బంగారం, వెండిని ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ ఆలయంలో ఈ ఆచారం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఈ సంప్రదాయంతో ఈ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని తీసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు.

భక్తులకు డబ్బులు, బంగారం, వజ్రాల నగలు ప్రసాదంగా పంచె ఆలయం.. దీపావళికి పోటెత్తే భక్తులు
Ratlam Lazmi Devi Temple
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2024 | 8:15 AM

భారతదేశంలోని అనేక దేవాలయాలు వాటి సొంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. వివిధ రకాల రహస్యాలు, విశిష్టతతో మత విశ్వాసాలతో ప్రసిద్ధి చెందాయి. అటువంటి విశిష్ట దేవాలయం మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఆనుకుని ఉన్న రత్లాం జిల్లాలోని మనక్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం మతపరమైన ప్రాముఖ్యతకు మాత్రమే కాదు.. భక్తులకు పంచె ప్రసాదంతో కూడా ప్రసిద్ది చెందింది. ఇక్కడ బంగారం, వెండిని ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం కారణంగా కూడా ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ భక్తులకు పండ్లు, స్వీట్లు లేదా పంచదార మిఠాయిలకు బదులుగా బంగారం, వెండిని ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ ఆలయంలో ఈ ఆచారం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఈ సంప్రదాయంతో ఈ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని తీసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు.

భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, వజ్రాభరణాలను సమర్పిస్తారు.

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి భక్తులు డబ్బు, బంగారం, వెండి, వజ్రాభరణాలను సమర్పిస్తారు. దీపావళి పండగ సమయంలో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సమయంలో ఈ ఆలయాన్ని డబ్బు, బంగారం, వెండి , వజ్రాభరణాల వంటి వాటితో అలంకరిస్తారు. ఈ సమయంలో అమ్మవారి మహా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ దీపావళి సందర్భంగా మహాలక్ష్మి దేవిని కరెన్సీ నోట్ల కట్టలు, పువ్వులకు బదులుగా బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు.

ఈ ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేక గుర్తింపు కోసం కరెన్సీ నోట్లు, బంగారం, వెండి, వజ్రాభరణాలను కానుకగా అందజేస్తారు. ఇక్కడ డబ్బు, నగలు సమర్పించడం ద్వారా సంపద పెరుగుతుందని, లక్ష్మీ దేవి అనుగ్రహం, ఆశీర్వాదం లభిస్తుందని ఈ ఆలయం గురించి ప్రసిద్ధ పురాతన నమ్మకం ఉంది. అయితే ఇలా భక్తులు అమ్మవారికి సమర్పించిన డబ్బు, ఆభరణాలను దాచరు. కొన్ని రోజుల తర్వాత అమ్మవారికి కానుకలుగా వచ్చిన డబ్బు , నగలు లక్ష్మీ దేవి ప్రసాదంగా భక్తులకు తిరిగి ఇవ్వబడతాయి.

ఇవి కూడా చదవండి

భక్తుడు ఆలయానికి నైవేద్యంగా ఏది సమర్పించినా ఆలయ సభ్యులు దానిని లెడ్జర్‌లో నమోదు చేస్తారు లేదా భక్తుడి పేరు, అతని ఫోటోతో పాటు నమోదు చేస్తారు. దీని తరువాత దీపావళి ఐదవ రోజున, లెడ్జర్ లేదా రిజిస్టర్‌లో నమోదు చేయబడిన సమాచారం ఆధారంగా భక్తులకు సమర్పించిన డబ్బు , నగలు లక్ష్మీదేవికి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడతాయి.

ఆలయ గుర్తింపు

మహాలక్ష్మి అమ్మవారి అలంకారానికి డబ్బు, నగలు ఉపయోగించే భక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు. ఆలయం నుంచి ప్రసాదంగా ఇచ్చే డబ్బు, ఆభరణాలను భద్రంగా ఉంచడం ద్వారా ఇల్లు సంపదతో నిండి ఉంటుందని నమ్మకం. ఈ కారణంగా ప్రజలు లక్ష్మీ దేవి ప్రసాదంగా ఆలయం నుండి వచ్చిన డబ్బు , బంగారు, వెండి ఆభరణాలను ఎప్పుడూ ఖర్చు చేయరు లేదా విక్రయించరు. అమ్మవారి ప్రసాదాన్ని ఆశీర్వాదంగా తమ వద్ద ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి