AP RGUKT IIIT admissions 2023: జూన్‌ 3న ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూన్‌ 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి..

AP RGUKT IIIT admissions 2023: జూన్‌ 3న ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
AP RGUKT
Follow us

|

Updated on: May 31, 2023 | 1:26 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూన్‌ 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.

కాగా ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు ప్రతీయేట మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.