Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Floods: ఏపీలో తీవ్ర విషాదం.. 26 మందిని మింగేసిన చెయ్యేరు వాగు

చెయ్యేరు వాగు కారణంగా కొట్టుకుపోయిన 26మంది సజీవ సమాధి అయిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారిక సమాచారం వచ్చేసింది.

AP Floods: ఏపీలో తీవ్ర విషాదం.. 26 మందిని మింగేసిన చెయ్యేరు వాగు
Kadapa Floods
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 12:52 PM

చెయ్యేరు వాగు కారణంగా కొట్టుకుపోయిన 26మంది సజీవ సమాధి అయిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారిక సమాచారం వచ్చేసింది. శనివారం 12, ఆదివారం 5 మృతదేహాలను వెలికితీశారు. మరో గుర్తుతెలియని శవాన్ని కనుగొన్నారు. మొత్తంగా 26మందిలో 18 మృతదేహాలను వెలికితీశారు. అందులో 15 దేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించారు. చనిపోయిన వాళ్లందరూ కడప జిల్లాని చెయ్యేరు నదికి సమీప గ్రామాలైన మండపల్లి, పులపత్తూరు, గుంట్లూరు వాసులు. మొన్న 19వ తేదీ తెల్లవారుఝామున కార్తీక పౌర్ణమి వేళ శివాలయంలో పూజలు చేసేందుకు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు.

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు 

భారీ వర్షానికి బ్రిడ్జి కూలిపోవడంతో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి వరద తాకిడికి కూలిపోయింది. రాకపోకలు జరగకుండా గోడ నిర్మిస్తున్నారు అధికారులు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వంతెన దెబ్బతినడంతో కమలాపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మించి 44 ఏళ్లు అవుతుందని అంటున్నారు అధికారులు. వంతెన కూలిపోవడంతో అటు వైపు వాహనాలు రాకుండా నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా కమలాపురం-వేంపల్లి మీదుగా ఒక రహదారి, కమలాపురం-ప్రొద్దుటూరు మీదుగా మరో రహదారి, కమలాపురం-ఖాజీపేట ఇంకో మార్గం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

కడప రాధాకృష్ణానగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల్లో చిక్కుకున్న తల్లీకుమార్తెను సురక్షితంగా రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది ఇద్దరి ప్రాణాలు కాపాడారు.

Also Read: Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్య పరిస్థితిపై గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..