AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఢిల్లీ వేదికగా దీక్షకు దిగిన వైఎస్ షర్మిల.. ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి చెప్పాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ హామీ నిలబెట్టుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు.

YS Sharmila: ఢిల్లీ వేదికగా దీక్షకు దిగిన వైఎస్ షర్మిల.. ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి చెప్పాలని డిమాండ్
Ys Sharmila
Balaraju Goud
|

Updated on: Feb 02, 2024 | 6:48 PM

Share

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ హామీ నిలబెట్టుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు.

అంతకు ముందు కేంద్ర హామీలపై విపక్షనేతల మద్దతను కోరుతూ ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఈ ఉదయం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిసి మద్దతు కోరారు. ఆ తర్వాత డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో భేటీ అయ్యారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని షర్మిల కోరారు. ఏపీ విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేకహోదా, హామీల అంశాన్ని పార్లమెంట్‌ లో లేవనెత్తుతామన్నారు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.

‘దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర తీర్చుదిద్దుతామని ప్రధాని మోదీ హామి ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఏపీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్న షర్మిలా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాయమాటలు చెప్పి తప్పుంచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు’’ అని షర్మిల విమర్శించారు.

సీఎం జగన్‌ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్న షర్మిల.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయినప్పటికీ అన్ని అంశాల్లో బీజేపీ సర్కార్‌కు వైసీపీ మద్దతు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో బయటపెట్టాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..