AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఈడీ (ED), ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (IT) రంగంలోకి దిగడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత, నగదు అక్రమ మళ్లింపు జరిగిందన్న పక్కా సమాచారంతో అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
Income Tax Department Joins Ed Investigation
Vijay Saatha
| Edited By: |

Updated on: May 03, 2026 | 3:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఈడీ (ED), ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (IT) రంగంలోకి దిగడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత, నగదు అక్రమ మళ్లింపు జరిగిందన్న పక్కా సమాచారంతో అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.

ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 3,500 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇందులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు లెక్కల్లో చూపని నగదు సృష్టించినట్లు ఆదాయపన్ను శాఖ అనుమానిస్తోంది. ప్రతి మద్యం బ్రాండ్‌పై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. కేవలం ఈ కమీషన్ల రూపంలోనే నెలకు ₹70 నుంచి ₹80 కోట్ల వరకు అక్రమ సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిందితులు నగదు తరలింపు కోసం అత్యంత రహస్య పద్ధతులను పాటించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్థారణకు వచ్చాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రామ్‌గూడ వంటి విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రాలుగా మార్చుకున్నారు. అక్రమ నగదును హవాలా మార్గాల్లో దుబాయ్ వంటి విదేశాలకు మళ్లించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ముడి సరుకుల మోసం: బాటిళ్లు, క్యాప్‌ల కొనుగోలులో మార్కెట్ ధర కంటే 3 నుండి 5 రెట్లు ఎక్కువ రేటు చూపించి, ఆ అదనపు మొత్తాన్ని బ్లాక్ మనీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. డిజిటల్ ఆధారాలు దొరక్కుండా నిందితులు VPNలు, అంతర్జాతీయ నంబర్లు, సిగ్నల్, వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడారు. అయినప్పటికీ, కొరియర్ నెట్‌వర్క్, మధ్యవర్తుల ద్వారా జరిగిన నగదు కదలికలను ఐటీ అధికారులు గుర్తించారు.

నకిలీ ఇన్వాయిసులు సృష్టించిన డిస్టిల్లరీలు, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెషనల్స్, మధ్యవర్తులకు ఐటీ శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. భారీగా ఎగవేసిన పన్నుతో పాటు పెనాల్టీలను వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోంది. దీంతో ఈ స్కామ్‌లో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసి కీలక నిందితులపై పన్ను వసూళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
ఏపీ మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 2026ఫీజు చెల్లింపులు ప్రారంభం
టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 2026ఫీజు చెల్లింపులు ప్రారంభం
చేపల కోసం వేసిన వల ఈ మిస్టరీకి కారణమైంది...
చేపల కోసం వేసిన వల ఈ మిస్టరీకి కారణమైంది...
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గించే పల్లీల నువ్వుల లడ్డు
మోకాళ్ళనొప్పులు, నడుమునొప్పులు తగ్గించే పల్లీల నువ్వుల లడ్డు
వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..
వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..
RBI కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న కంపెనీ
RBI కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్న కంపెనీ
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!