ఏపీలోని ఆ ప్రాంతానికి కూల్ న్యూస్.. రెండు రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు పేర్కొంది.. ఒక ప్రాంతంలో వర్షాలు.. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు పేర్కొంది.. ఒక ప్రాంతంలో వర్షాలు.. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.. ఈ మేరకు మూడు రోజుల వాతావరణ అంచనాను వెల్లడించింది.
- అల్పపీడన ద్రోణి, తమిళనాడు తీరానికి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
- నిన్నటి, హిందూ మహాసముద్రం – దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడినది.
- దిగువ ట్రోపోఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలో నైరుతి దిశగా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమలలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రాయలసీమ :-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశము లేదు.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..