AP ICET 2025 Notification: ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది..

అమరావతి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాదికి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 7వ తేదీన నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.650, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
కాగా ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 7వ తేదీన మొత్తం రెండు షిఫ్టులలో ఈ పరీక్ష ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. విద్యార్హతలు, ఆలస్య రుసుముతో దరఖాస్తులు చెల్లించవల్సిన గడువు తేదీలు, సిలబస్ వంటి ఇతర పూర్తి సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్ విడులైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.