TGPSC Group 2 Results 2025: తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి
ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎందురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రూప్ 2 పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ మంగళవారం (మార్చి 11) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..

హైదరాబాద్, మార్చి 7: టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు శుభవార్త. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రూప్ 2 పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం (మార్చి 11) మధ్యాహ్నం 3 గంటలకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్ 2 అభ్యర్ధుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్‌ను TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. మార్కులతోపాటు అభ్యర్థుల OMR షీట్స్‌ను కూడా వెబ్‌సైట్ లో కమిషన్ అందుబాటులో ఉంచింది. ఇక గ్రూప్ 2 ఫైనల్ ఆన్సర్ కీతో పాటు టాపర్స్ లిస్ట్‌ను కూడా టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో 368 కేంద్రాల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని టీజీపీఎస్సీ ఈ ఏడాది జనవరి నెలలో 17వ తేదీన విడుదల చేసింది. ఆన్సర్ కీ అభ్యంతరాలను జనవరి 22 వరకు స్వీకరించింది. ఇక తుది ఆన్సర్ కీ రూపొందించిన కమిషన్ తాజాగా ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షలను మొత్తం 4 పేపర్లకు రెండు రోజుల పాటు జరిగాయి.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 మార్కులు, ర్యాంకుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకుంటే పరీక్షకు మాత్రం కేవలం 45.57 శాతమే హాజరయ్యారు. అంటే దాదాపు రెండున్నర లక్షల మంది మాత్రమే అభ్యర్ధులు పరీక్ష రాశారు. అప్పటి నుంచి ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు ఈ రోజు తెరపడినట్లైంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.