AP Police: స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి.. అయ్యన్నపాత్రుడిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం..
AP IPS officers' association: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్‌ఆర్ సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ అధికారులపై
AP IPS officers’ association: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్‌ఆర్ సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ద్వారకా తిరుమలరావు ప్రకటనను విడుదల చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎస్పీ నా కొడుకులు అని సంభోదించడం ఆక్షేపణీయం. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ పేర్కొన్నారు. రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న మా పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తూలనాడడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దు. పరిధిని అతిక్రమించి మాట్లాడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి తిరుమలరావు పేర్కొన్నారు.
Also Read: