Duplicate Certificates: వరదల్లో సర్టిఫికెట్లు పోయాయా? మరేం పర్వాలేదు.. ఉచితంగా డూప్లికేట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న ఇంటర్‌ బోర్డు

ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నానా భీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద కనీవినని రీతిలో తీవ్ర నష్టం మిగిల్చింది. దీంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ క్రమంలో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొందరు కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు కోల్పోయారు. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న..

Duplicate Certificates: వరదల్లో సర్టిఫికెట్లు పోయాయా? మరేం పర్వాలేదు.. ఉచితంగా డూప్లికేట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న ఇంటర్‌ బోర్డు
Duplicate Certificates
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2024 | 4:35 PM

అమరావతి, అక్టోబర్ 2: ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నానా భీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద కనీవినని రీతిలో తీవ్ర నష్టం మిగిల్చింది. దీంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ క్రమంలో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొందరు కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు కోల్పోయారు. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్‌ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరద ముప్పుకు గురైన వారందరికీ ఎలాంటి రుసుములూ లేకుండా ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది.

సర్టిఫికెట్లు కోల్పోయిన అందరికీ ఉచితంగా సర్టిఫైడ్‌ కాపీలు, డూప్లికేట్‌ సర్టిఫికెట్లను అందించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీని గుర్చిన సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఐవోలు, డీఐఈవోలు ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ల కాపీల కోసం వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్‌, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే నేరుగా బోర్డు అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.

వరదల్లో సర్టిఫికెట్లతోపాటు ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు సైతం నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ భావిస్తోంది. వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న విద్యార్థులకు సంబంధించి రెండు రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే ఉచితంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్‌ అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో డిజి లాకర్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని.. డిజి లాకర్స్‌ను ఏఐతో అనుసంధానించడం ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.