Home Minister Anitha: ఎప్పుడూ వాళ్లేనా.. మేమూ చేస్తాం.. పవర్ పాలి’ట్రిక్స్‌’ కేరాఫ్ అనిత..!

ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన, శక్తివంతమైన పోర్ట్ ఫోలియోను చేపట్టిన ఆ మహిళా నేత, ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారా? పంటి బిగువున కష్టాలను, ఇబ్బందులను, అవమానాలను దిగమింగిన ఆ జేజమ్మ.. ఇప్పుడు ఇది నా అడ్డా! ఎవరొస్తారో రండి చూద్దాం అని గర్వంగా తల ఎగురవేస్తోందా? రాజకీయం అంటే వాళ్ళే కాదు, మేమూ చేస్తాం అని పవర్ పాలిటిక్స్ ను ప్రాక్టీస్ చేస్తోందా?

Home Minister Anitha: ఎప్పుడూ వాళ్లేనా.. మేమూ చేస్తాం.. పవర్ పాలి'ట్రిక్స్‌' కేరాఫ్ అనిత..!
Chandrababu, Vangalapudi Anitha
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 13, 2024 | 6:25 PM

ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన, శక్తివంతమైన పోర్ట్ ఫోలియోను చేపట్టిన ఆ మహిళా నేత, ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారా? పంటి బిగువున కష్టాలను, ఇబ్బందులను, అవమానాలను దిగమింగిన ఆ జేజమ్మ.. ఇప్పుడు ఇది నా అడ్డా! ఎవరొస్తారో రండి చూద్దాం అని గర్వంగా తల ఎగురవేస్తోందా? రాజకీయం అంటే వాళ్ళే కాదు, మేమూ చేస్తాం అని పవర్ పాలిటిక్స్ ను ప్రాక్టీస్ చేస్తోందా? ఒకప్పుడు ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే హడావుడి గా కనిపించే నేతల స్థానంలో కరుడు గట్టిన కార్యకర్తగా పనిచేస్తూనే ప్రశంసలు పొందుతున్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలన్న సూత్రాన్నీ అంట బెట్టించుకుని ముందుకు వెళ్తున్నారు ఆ లేడీ సింగం..!

ఒకప్పుడు బెత్తం పట్టుకుని స్కూల్ పిల్లల అల్లరిని నియంత్రించిన ఆ పంతులమ్మ, ఇప్పుడు రాష్ట్రంలో నేరగాళ్ల పాలిట అపర కాళిగా మారింది. పిల్లలకు విద్యా బుద్దులు చెప్పడాన్ని కెరీర్ ప్రారంభించి, అనూహ్య మలుపులు తిప్పుకుని రాష్ట్ర హోం మంత్రి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వంగలపూడి అనిత ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషన్. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, బలంగా వినిపించే అనిత, ఇప్పుడు రాజకీయంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదానికి తావివ్వకుండానే ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను నియంత్రించే పాఠాలను వల్లె వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాను డామినేట్ చేస్తున్నట్టు బయటకు కనిపించనీయ్యకుండానే, తనకు వచ్చిన అవకాశాన్ని బలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనిత.

ఉమ్మడి విశాఖ జిల్లాలనుంచి పలువురు అతిరథ మహారథులు భారీ మెజారిటీలతో నెగ్గినా, మంత్రి పదవిని దక్కించుకోవడంలో అనిత విజయం సాధించారనే చెప్పాలి..! జిల్లాలో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాగా, మంత్రి పదవిని బలంగా ఆశించిన మాజీ మంత్రులు గంటా, బండారు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయిన వెలగపూడి, గణబాబు, జనసేన నుంచి కొణతాల, పంచకర్ల రమేష్, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు లాంటి పలువురు బలంగా మంత్రి పదవులు ఆశించారు. అయితే రెండోసారి ఎమ్మెల్యే ఆయిన అనిత వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపి, మంత్రి పదవి ఇచ్చింది. అదీ మామూలు పోర్ట్ ఫోలియో కాదు అత్యంత శక్తివంతమైన హోం మంత్రి.

అలా పదవి దక్కించుకున్న వెంటనే ఉమ్మడి జిల్లాల్లో అందరి ఎమ్మెల్యేల ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి, నేను హోం మంత్రిని అయినా పార్టీ విధేయురాలిగానే ఉంటానంటూ, అందరి ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్లకు మంత్రి పదవి రాలేదన్న బాధ నుంచి బయట పడేసే ప్రయత్నం చేశారు అనిత. తనకు పదవి వచ్చిందని పొంగి పోవడం లేదంటూ, అందరం కలిసి ఒక టీంగా పని చేద్దాం అన్న సంకేతాలతో అందరి ఇళ్లకు స్వయంగా వెళ్ళారు. అలా తన చాతుర్యాన్ని ప్రదర్శించిన అనిత, అదే సమయంలో హోంమంత్రి గా తనకు దక్కే ప్రివిలేజెస్ విషయం లో కానీ, ఆ స్థాయీ నాయకత్వాన్ని ప్రదర్శించడంలో ఎక్కడా తడబడడం లేదన్న ప్రశంసలను పొందుతున్నారు. మహిళా నేత అనో, లేదంటే జూనియర్ అనో అభిప్రాయాన్ని ఎక్కడా రానీయకుండా, అదే సమయంలో నాయకత్వం విషయంలో ఎవరి జోక్యాన్ని లేకుండా తనదైన శైలీ రాజకీయాన్ని చేస్తున్నారన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం అనిత పావులు కదుపుతూ ముందుకు వెళ్తోందన్న తీరు అందరి మన్నలు పొందుతోంది.

ఇక గతంలో విశాఖ జిల్లాకు ముఖ్య మంత్రి వస్తున్నారంటే రెండు మూడు రోజుల నుంచి మొదలయ్యే హడావుడిలో అప్పటి మంత్రుల హడావిడి ఎక్కువగా ఉండేది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలని దగ్గర ఉంచుకుని ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లని చేయడంలో గంటా శ్రీనివాస్, అయ్యన్న, బండారు లాంటి నేతలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఈసారి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంలో ఉత్తరాంధ్ర పర్యటనకి వచ్చిన నేపథ్యంలో అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగిన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో అనితదే కీలక భాగస్వామ్యం. మహిళా నేతగా, హోం మంత్రిగా తనకు దక్కిన అవకాశాన్ని గట్టిగా వినియోగించుకున్నారు. ఎక్కడా పొరపాటు లేకుండా, సకాలంలో అందరికీ నచ్చేలా మెచ్చేలా చేయడంలో అనిత చూపిన డైనమిజంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటించాల్సిన కార్యక్రమాల రూపకల్పన, వాటిని విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణ వాటి ఎగ్జిక్యూషన్ లాంటి అంశాలతోపాటు అధికారులతో సమన్వయం, సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ అనిత చేసిన రాజకీయ హడావుడిపై టీడీపీతోపాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా చర్చించుకుంటున్నాయి.

ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో కూడా కార్యక్రమాలను ఆయన వివరించడంతోపాటు సకాలంలో వాటిని సమర్థవంతంగా నిర్వహించిన తీరు పైనా అధికార వర్గాలలో చర్చ జరుగుతుంది. అనిత రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ 2019 – 2024 లో ప్రతిపక్షంలో అనిత చేసిన పోరాటానికి మంచి గుర్తింపు లభించింది. 2014 ముందు తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన అనిత మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పటికీ, అప్పటి ప్రతిపక్ష నేత రోజాపై పదునైన విమర్శలు చేయడం ఇద్దరి మధ్య జరిగిన పొలిటికల్ ఎపిసోడ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి తాజా మాజీ హోం మంత్రి వనిత చేతిలో ఓటమిపాలైన వనితతోపాటు వైసీపీ నేతలు అందరిని గట్టిగా ప్రశ్నించడంలో పోరాటాలు చేయడంలో అనిత ఒకరకంగా విజయం సాధించారనే చెప్పాలి. దాంతోనే టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ గా, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పదవులు పొంది, తనపై అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ తగ్గించకుండా పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వహించారు. అందుకే ప్రభుత్వం రాగానే ఆమెకి హోం మంత్రి పదవి ఇచ్చి, ఆమె నాయకత్వాన్ని సమర్ధించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. దానికి తగ్గట్టుగానే అనిత ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, చూపుతున్న సమర్థత పట్ల టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్