AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Vemireddy Mark: ఉమ్మడి జిల్లాలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు.. షాక్ అవుతున్న జనం..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యే డిఫరెంట్‌గా ఉంటున్నారట.. నిన్నటి దాకా ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేల్లా కాకుండా కొత్త తరహాగా ఉండడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజలకు అంతా కొత్త కొత్తగా ఉందట. తాజా ఎమ్మెల్యే తీరు.. ఉద్యోగుల బదిలీల నుంచి గ్రావెల్ అక్రమాల దాకా అంతా వ్యతిరేకంగా జరుగుతోందట అక్కడ.. ఇంతకీ అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.

MLA Vemireddy Mark: ఉమ్మడి జిల్లాలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు.. షాక్ అవుతున్న జనం..!
Kovvur Mla Vemireddy Prashanthi Reddy
Ch Murali
| Edited By: |

Updated on: Jul 13, 2024 | 5:28 PM

Share

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యే డిఫరెంట్‌గా ఉంటున్నారట.. నిన్నటి దాకా ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేల్లా కాకుండా కొత్త తరహాగా ఉండడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజలకు అంతా కొత్త కొత్తగా ఉందట. తాజా ఎమ్మెల్యే తీరు.. ఉద్యోగుల బదిలీల నుంచి గ్రావెల్ అక్రమాల దాకా అంతా వ్యతిరేకంగా జరుగుతోందట అక్కడ.. ఇంతకీ అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వంద చెబుతారు. అన్నీ చేస్తారా ఏంది..! మంచి చేస్తామని చెప్పి చేయకపోతే.. ఆ ఆ మాజీ లాగే ఈ తాజా అనుకుంటారు. అదే అక్కడ ఎమ్మెల్యే భిన్నంగా ఉంటే.. ఎలా ఉంటుందో ఉదాహరణ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అనూహ్యంగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమాలను అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రశాంతి రెడ్డి, తాను ఎమ్మెల్యే అయితే ప్రశాంతమైన పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రశాంతి రెడ్డి అభిమానులు కూడా ప్రశాంతితోనే కోవూరు ప్రశాంతత అనే స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొన్ని దశాబ్దాలుగా కోవూరులో ఎవరికి రానంత మెజారిటీతో 50 వేల ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యే అయిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని జిల్లాలోని సంచలన ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద దందాలు చేయడం గ్రావెల్ తవ్వకాలకు పాల్పడడం, ఇసుక అక్రమ రవాణా, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు విషయంలో ముడుపులు తీసుకోవడం ఇలాంటి విషయాలు తన నియోజకవర్గంలో జరగకూడదని, ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. గత ఐదేళ్లుగా కోవూరు నియోజకవర్గంలో ఈ నాలుగు అంశాలపైనే ప్రధానంగా ఆరోపణలు వివాదాలు జరిగాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలనేది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పార్టీ క్యాడర్ కు చెప్పిన మాట.

అన్నింటికీ మించి ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. పారిశుధ్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం, గ్రామాల్లో పరిష్కారం లేని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎమ్మెల్యే ప్రశాంతి. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సడన్ విజిట్ పెడుతూ, గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎమ్మెల్యేకు పోలికేలేదని గ్రామాల్లో చర్చ జరిగేలా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని, కలవాలంటే మూడు గేట్లు దాటాలని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపణ చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్ రెడ్డి మాకు అందుబాటులో లేడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిత్యం మా మధ్య ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో యువత మాజీ ఎమ్మెల్యేలకు తాజా ఎమ్మెల్యేలకు ఉన్న పోలికను చెబుతున్నారు.

ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై కక్ష సాధింపులు ప్రతి చోటా జరుగుతుండేవి. అలాంటి వాటికి అవకాశం లేకుండా చూస్తున్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. అలాగే గతంలో సామాన్యులపై కూడా దాడులు జరిగాయి. ఈ సంస్కృతికి దూరంగా శాంతి భద్రతల అమలు సీరియస్ గా చూసుకుంటున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలను విపరీతంగా పెట్టుకుంటున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలతో పోల్చి చూసేలా ఉందని పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..