Balloons Theatre: ప్రకృతి ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న బెలూన్ ధియేటర్.. ఎక్కడుందో తెలుసా..?

సూర్యలంక బీచ్‌కు పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున తాకిడి ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా సూర్యలంక బీచ్ కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దీంతో సూర్యలంక సముద్ర తీరం ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.

Balloons Theatre: ప్రకృతి ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న బెలూన్ ధియేటర్.. ఎక్కడుందో తెలుసా..?
Balloons Theatre
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 13, 2024 | 7:14 PM

సూర్యలంక బీచ్‌కు పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున తాకిడి ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా సూర్యలంక బీచ్ కు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దీంతో సూర్యలంక సముద్ర తీరం ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. తాజాగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ధియేటర్ తెగ ఆకట్టుకుంటోంది.

బీచ్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించే క్రమంలో అనేక ఏర్పాట్లు చేశారు. హరితా రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా ప్రైవేటు రిసార్ట్స్ అనేకం సూర్యలంక సముద్ర తీరంలో వెలిశాయి. అయితే బాపట్ల నుండి సూర్యలంక వెళుతున్న రోడ్డు మార్గంలో మనకి దీర్ఘ చతురస్త్రాకారంలో ఉన్న ఒక నిర్మాణం తెగ ఆకట్టుకుంటోంది.. అదేంటా అని పర్యాటకులు కూడా ఆసక్తిగా తిలకిస్తారు. దాని ముందు పెద్ద పెద్ద సినిమా పోస్టర్లు కూడా ఉంటాయి. అక్కడ ఆగి పరిశీలిస్తే అది ఒక సినిమా ధియేటర్ అని తెలుస్తోంది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా..!

అది అన్ని సినిమా హాళ్లులాగా ఏర్పాటు చేసింది కాదు.. అది పూర్తిగా బెలూన్ ధియేటర్. ఒక పెద్ద గాలి యంత్రం ద్వారా దానిలోకి గాలి నిత్యం నింపుతుంటారు. సముద్ర తీరానికి వచ్చే ప్రకృతి ప్రేమికలకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వాలని భావించిన స్థానికులు రోటీన్ కు భిన్నంగా బెలూన్ ధియేటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 120 సీట్లు ఉంటాయి. పూర్తి ఏసి ధియేటర్. సూర్యలంక నుండి బాపట్ల రాకుండానే సముద్ర తీరంలో సేద తీరిన తర్వాత ఇక్కడికొచ్చి సినిమా చూసి వెళ్లవచ్చు. సాధారణ ధియేటర్ల కంటే భిన్నంగా ఉండటంతో పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. థియేటర్ తోపాటు స్టాల్స్ కూడా ఉన్నాయి. సాధారాణ ధియేటర్ లో సినిమా చూసిన దాని కంటే ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఏపీలోనే మొదటి బెలూన్ ధియేటర్ గా స్థానికులు చెప్పుకుంటున్నారు.

సూర్యలంక సముద్ర తీరానికి ఎక్కువుగా వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడమే కాకుండా పర్యాటక రంగ అభివృద్దిలో భాగంగా ఈ సినిమా హాల్ ను ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు కొల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో కూడా పర్యాటక రంగం అభివృద్దికి కృషి చేసినప్పుడే ఆయా ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్