ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.. 60 ఏళ్లు వచ్చే వరకూ అర్హులే అంటూ హైకోర్టు తీర్పు

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు.. హైకోర్టులో ఊరట లభించింది. వారికి...

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.. 60 ఏళ్లు వచ్చే వరకూ అర్హులే అంటూ హైకోర్టు తీర్పు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2021 | 7:26 AM

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు.. హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్‌ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం… 58 ఏళ్లకే పలువురు ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్ అయ్యారు. గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్‌ ఉందంటూ… పదవీ విరమణ పొందిన కొందరు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2017 లో పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ గ‌వ‌ర్న‌మెంట్ నోటిఫికేషన్‌ జారీ చేసిందని హైకోర్టు పేర్కొంది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఉద్యోగుల మధ్య వివక్ష చూపేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చింది.

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు

ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ( ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగ‌ళ‌వారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆర్‌పీ ఠాకూర్ నిన్న పదవీ విరమణ చేయడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ద్వారకా తిరుమలరావును గ‌వ‌ర్న‌మెంట్ ఆయన స్థానంలో నియమించింది.

Also Read: తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసే అవకాశం

విమానాల్లో ఫ్రీగా తిరిగిన భార‌తర‌త్న అవార్డీ ఆయనొక్కరే.. ఎన్నిసార్లు ప్రయాణించారంటే..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే