AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెండ్.. ఒక్క రోజులోనే..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ముందుగా.. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన కేసులో..

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెండ్.. ఒక్క రోజులోనే..
AP High Court
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2023 | 3:23 PM

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ముందుగా.. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఇద్దరు విద్యాశాఖ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆ ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది. అయితే, ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పడంతో న్యాయస్థానం జైలు శిక్షను రద్దు చేసింది. అందుకు అనుగుణంగా సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు ఇక్కడే నిలబడాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆతర్వాత కొంతసేపటికే కొర్టు ధిక్కారానికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.

పూర్తి వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు సంబంధించిన విషయంపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునివ్వడంతోపాటు.. అమలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును అమలు చేయకపోవడంతో ఉద్యోగులు మళ్లీ హైకోర్టుకు వెళ్లగా.. దీనిపై వాదనలు జరిగాయి. అంతకుముందు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు నెలరోజుల పాటు జైలుశిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అయితే ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ధర్మాసనం జైలు శిక్షను రద్దు చేసింది.

అందుకు అనుగుణంగా సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు ఆవరణలోనే నిలబడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన హైకోర్టును తీర్పును అమలు చేయని నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చిన కాసేపటికే.. డివిజన్ బెంచ్ ధర్మాసనం.. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..