AP High Court: లిక్కర్ అమ్మకాల పిల్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం..
AP High Court: ఏపీలో డిజిటల్ పేమెంట్లోనే లిక్కర్ అమ్మకాలు జరపాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాసరి ఇమ్మాన్యుయల్ అనే వ్యకి తరపున న్యాయవాది నాగ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీలో డిజిటల్ పేమెంట్లోనే లిక్కర్ అమ్మకాలు జరపాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాసరి ఇమ్మాన్యుయల్ అనే వ్యకి తరపున న్యాయవాది నాగ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ .. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI నిబంధనల ప్రకారం ప్రతి లిక్కర్ షాపు వద్ద డిజిటల్ పేమెంట్ అప్షన్ ఉండాలని హైకోర్టు సూచించింది. మైనర్లకు లిక్కర్‌ను విక్రయించకుండా అరికట్టేందుకు ఆధార్ లింక్ చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఆధార్ అనుసంధానంపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
అయితే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ విధానం ప్రవేశపెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన దాసరి ఇమ్మాన్యుయల్ దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందు మరోసారి విచారణకు వచ్చింది. మద్యం విక్రయాన్ని ఆధార్‌తో లింక్ చేయాలని కోరుతురు పిటిషనర్ తరఫు న్యాయవాది వి.నాగప్రవీణ్ కోర్టులో వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి: SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..
TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..