జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టత.. ఎన్నికల జరపాలని ఆదేశించలేమన్న ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. వెంటనే ఎన్నికలు జరిపేలా తాము ఆదేశాలు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్ఠు స్పష్టం చేసింది.
AP High Court on Parshad Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. వెంటనే ఎన్నికలు జరిపేలా తాము ఆదేశాలు ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్ఠు స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు ధర్మసనం విచారణ చేపట్టింది. వెంటనే ఎన్నికలు జరిపేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
Read Also… Loan moratorium Case : రుణ మారటోరియం గడువు పొడిగించలేం, వడ్డీ మాఫీ చేయలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ,