Janasena: జనసేనకు మరో సమస్య.. గాజు గ్లాసు సింబల్‌పై చిక్కు వీడే దారేది..? 13న ఏం తేలనుంది..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పొత్తులు-ఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా జనసేన - టీడీపీ అడుగులేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ముంగిట్లో జనసేనకు మళ్లీ సింబల్‌ కిరికిరి ఎదురైంది. గాజు గ్లాస్‌ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జ

Janasena: జనసేనకు మరో సమస్య.. గాజు గ్లాసు సింబల్‌పై చిక్కు వీడే దారేది..? 13న ఏం తేలనుంది..
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 09, 2024 | 8:01 AM

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పొత్తులు-ఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా జనసేన – టీడీపీ అడుగులేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ముంగిట్లో జనసేనకు మళ్లీ సింబల్‌ కిరికిరి ఎదురైంది. గాజు గ్లాస్‌ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జనసేన కన్నా ముందే తాము గాజుగ్లాసు గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టును ఆశ్రయించారు రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు.. 2023 డిసెంబర్‌ 20న గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌. తమకు కాకుండా తమ తరువాత దరఖాస్తు చేసిన జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని పిటిషనల్‌లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల సీఈఓలతో పాటు జనసేన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.. స్పందించిన ఈసీ గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది.

2023 డిసెంబర్‌ 12న సింబల్‌ కేటాయింపు ప్రక్రియ మొదలైందని.. అదే రోజున జనసేన పార్టీ తరపున గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని దరఖాస్తు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పిటిషనర్‌ డిసెంబర్‌ 20న అప్లికేషన్‌ ఇస్తే.. అంతకన్నా ముందు డిసెంబర్‌ 12 జనసేన నుంచి దరఖాస్తు అందింది కావున ఆ పార్టీకి గాజు గ్లాసు కేటాయించడం జరిగిందని వివరణ ఇచ్చింది ఈసీ. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు..జన సేన ఇచ్చిన దరఖాస్తును జత చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. అయితే, ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..