Rain Alert: అబ్బబ్బ.! వాన కబురు మళ్లొచ్చింది.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని APSDMA పేర్కొంది.. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓసారి స్టోరీ చూసేయండి.

వాయువ్య బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. ఒడిస్సా తీరానికి అనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడనుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాకు వర్ష సూచనలు ఇచ్చింది ఐఎండి. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కూడా వస్తాయి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే కాకినాడ, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలాచోట్ల మోసరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
విశాఖలో..
అల్పపీడన ప్రభావంతో విశాఖలో ముసురు వాతావరణం నెలకొంది. ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. స్కూళ్లకు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారుల పైకి వర్షపు నీరు వచ్చేసింది.
హోం మంత్రి సమీక్ష..
ప్రభావం కోస్తా జిల్లాల్లో వర్షాలు నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు హోం మంత్రి అనిత. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని.. ప్రమాదకర హోర్డింగ్లు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు హోంమంత్రి.
