AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: లేడి డాన్ అరుణ పెద్ద కి’లేడీ’.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న సెటిల్మెంట్ దందాలు చూస్తుంటే ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులు సన్నిహితంగా ఉంటున్న విషయాలు బయట పడుతున్నాయి. దీంతో గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ మొదలైందట.

Andhra: లేడి డాన్ అరుణ పెద్ద కి'లేడీ'.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్
Nellore Nidigunta Aruna
Ch Murali
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 26, 2025 | 1:36 PM

Share

రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు బయట ఉన్న అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించిన విషయం తెలిసిందే.. అయితే గతంలో జైలు నుంచి శ్రీకాంత్ ఆస్పత్రికి వచ్చిన సందర్భంలో అరుణతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెరోల్ వచ్చిన నాలుగు రోజుల్లోనే రద్దు చేసి తిరిగి జైలుకు పంపారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటోంది. అరుణను అరెస్టు చేసి లోతుగా విచారణ జరుగుతున్న పోలీసులకు చార్జింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో సూళ్లూరుపేట లో సహజ మరణమే అనుకున్న కేసును హత్య కేసుగా అనుమానిస్తున్న పోలీసులు. ఓ వ్యక్తి తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్‌కి సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు సెటిల్ మెంట్ లు చేసినట్లు తేలిందట. వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తిని గంజాయి, వ్యభిచార గృహాలు నడపాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేసిన బాధితుడు.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే తో అరుణ సన్నిహితంగా మెలిగినట్లు ఫోన్ లోని వీడియోల ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న చీకటి కోణాల్లో పాత నేరాల చిట్టా బయట పడుతోంది. గత రెండేళ్లుగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో గ్యాంగ్ లు మెయింటైన్ చేసిన అరుణ ఆగడాలను పోలీసులు బయటకు తీస్తున్నారు.

అరుణ లీక్స్ సంచలనాలకు కేరాఫ్‌గా ఉండబోతుందా.?

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె ఫోన్ లో ఎవరెవరి రహస్యాలు దాగున్నాయి.. ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయి. పోలీసులు ఎప్పుడు ఆ వీడియోలను సేకరించబోతున్నారు..? అరుణకు సన్నిహితంగా ఉండే అధికారులు ఆందోళనలో ఉన్నారు. లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియోలు వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉన్నాయన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వంలో పని చేసిన IPS లతో పాటు ప్రస్తుతం సచివాలయంలో పని చేసే కీలక అధికారుల ప్రవేట్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకుని.. అరుణ సమక్షంలోనే అరుణ ఫోన్‌లో ఉండే సమాచారాన్ని తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన సమయంలో అరుణ దగ్గర నుంచి రెండు ఫోన్‌లు, రెండు సిమ్‌లను సీజ్ చేశారు. ఈ ఫోన్‌లో ఉండే వీడియోలు, ఆడియాలు ఎవరి కొంప ముంచుతాయో అన్న ఆందోళన అధికార, రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతుంది. ఆమె చాలా మంది పోలీస్ అధికారులతో సన్నిహితంగా మెలిగేదట. ఆమెకు కావాల్సిన పనిని వారి ద్వారా చేయించుకుది. వారు మాట వినకపోతే పై స్థాయి అధికారులతో సిపారస్ చేయించేదని ఆమె వైఖరి నచ్చని కొందరు పోలీసులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఉపయోగపడే అధికారులతో.. రాజకీయ నేతలతో ఫోన్ లో మాట్లాడే క్రమంలో ఆమెకు రికార్డు చేసే అలవాటు ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వారిని కలిసినప్పుడు ఫోటోలు, వీడియోలు సైతం తీసుకుంటారట. ఈ నేపథ్యంలోనే AR ASPగా గతంలో పని చేసిన మునిరాజ బాగోతన్ని కూడా ఆమె బయటపెట్టిందని ఆమె గురించి తెలిసిన ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఆమె బయట పెట్టిన ఆడియో వల్ల AR ASP మునిరాజాపై పోలీస్ శాఖ చర్యలు సైతం తీసుకుంది.

ఆమె వల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది క్రమశిక్షణ చర్యలకు గురయ్యారని పోలీస్ వర్గాల సమాచారం.. ఆమె బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తుందటంతో ఆమె కాల్ లిస్ట్ పై పోలీసులు దృష్టి పెట్టారు. గత రెండేళ్ల నుంచి ఆమె ఎవరెవరితో మాట్లాడింది..? ఎంత సేపు మాట్లాడింది..? చాటింగ్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ.. ఈ కాల్ లిస్ట్‌లో గూడూరుకి చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్ తో సన్నిహితంగా ఉండేదని.. అతనికే ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్, యాజమాన్యం కూడా సదరు అరుణకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో పేరోల్ కి సిపారస్ లేఖ ఇవ్వాలంటూ టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రిని సదరు వ్యక్తి కలవగా.. అందుకు అయన అంగీకరించలేదట.. దింతో అరుణకు ఆయనకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనే కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. తరహాలో అరుణ ఫోన్లో ఉండే వీడియోలు లీక్ అయితే ఎవరి బతుకు బస్టాండ్ అవుతుందో అన్న భయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..