Andhra News: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్ న్యూస్.. అలవెన్సులపై సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ఏపీ ప్రభుత్వం తీర్చనుంది. దీంతో ఆర్టీసీలోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చనుంది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుంచి 12 లోపు సిబ్బందికి అలవెన్స్ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాల్లో పేర్కొంది. దీని వల్ల అలవెన్స్ , నైట్ అవుట్ మంజూరై సుదూర ప్రాంతాలకు రాత్రిపూట డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లు కండక్టర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.
గతంలో అనేకసార్లు ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు వారి సమస్యలపై పోరాటాలు చేసిన గత ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రెండు నెలల ముందు స్పష్టమైన జీవో జారీ చేయకుండా పరిమిత డిపోలోనే నైట్ అవుట్ అలవెన్సులు ఇచ్చి గత ప్రభుత్వం ముగించేసింది. అన్ని డిపోల్లో అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసిన పట్టించుకోలేదు. దీంతో నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు కోసం ఆర్టీసీ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు అలవెన్స్‌లు మంజూరు చేయాలని ఆర్టీసీ సహా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికారులు పత్రాలను సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ సైతం పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అలవెన్స్ జారీ కోసం చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అలవెన్స్‌లను మంజూరు చేయడంపై ఆర్టీసీలోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి