Andhra News: రాత్రివేళ మందు పార్టీ అంటూ స్నేహితుడిని పిలిచాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..
ఆదివారం రోజు తన స్నేహితులకు మందు పార్టీ ఇస్తున్నానని, ఆపార్టీకి రావాలని దీపక్ ను ఆహ్వనించాడు కిరణ్.. ఆదివారం సాయంత్రం బాలజీ నగర్ సమీపంలోని పొల్లాల్లోకి వెళ్లి అందరూ మద్యం తాగారు.. ఆ తర్వాత కిరణ్ డబ్బులు విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విషయమై ఇద్దరి మద్య గొడవ జరగడంతో..
ఆదివారం రాత్రి.. పాత గుంటూరులోని బాలాజీ నగర్ కాలనీ.. అటుగా వెల్తున్న ఆటోను కొంతమంది యువకులు ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ ను అడిగారు. యువకుడి పేరు వెంకటరెడ్డి అని తెనాలి నుంచి వస్తున్నాడని చెప్పిన యువకులు తాము బైక్ పై ఆసుపత్రికి వస్తామని చెప్పారు. దీంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలైన ఆయువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చేర్చి వెళ్లిపోయాడు. అయితే కొద్దీ సేపటి తర్వాత అతని బంధువులు అక్కడికి చేరుకున్నారు. తెనాలికి చెందిన ఆయువకుడి పేరు దీపక్ అని చెప్పారు. అయితే వెంకటరెడ్డి అని ఎందుకు చెప్పారంటూ పోలీసులు దీపక్ తండ్రిని ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.
గుంటూరుకు చెందిన కిరణ్ తెనాలికి చెందిన దీపక్ లు ఇద్దరూ స్నేహితులు.. కొద్దీ రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న సమయంలో కిరణ్ ఫోన్ పే నుండి దీపక్ యాభై వేల రూపాయలను తన ఖాతాకు పంపించుకున్నాడు. ఈ విషయం తర్వాత గ్రహించిన కిరణ్ తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ దీపక్ ను పట్టుబట్టాడు. అయితే ఆ డబ్బులు తాను ఇస్తానంటూ దీపక్ తండ్రి చంద్రశేఖర్ ఒప్పుకున్నాడు. ఎన్ని రోజులు వేచి చూసినా అటు దీపక్ గాని ఇటు చంద్రశేఖర్ కాని కిరణ్ కు ఆ డబ్బులు ఇవ్వలేదు. దీంతో కిరణ్ దీపక్ పై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం రోజు తన స్నేహితులకు మందు పార్టీ ఇస్తున్నానని, ఆపార్టీకి రావాలని దీపక్ ను ఆహ్వనించాడు కిరణ్.. ఆదివారం సాయంత్రం బాలజీ నగర్ సమీపంలోని పొల్లాల్లోకి వెళ్లి అందరూ మద్యం తాగారు.. ఆ తర్వాత కిరణ్ డబ్బులు విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విషయమై ఇద్దరి మద్య గొడవ జరగడంతో కిరణ్ అతని స్నేహితులు దీపక్ పై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో దీపక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిస్థితిని గ్రహించిన కిరణ్ అతని స్నేహితులు అతని పేరు మార్చి వెంకటరెడ్డి అని ఆటో డ్రైవర్ కు చెప్పి గుంటూరు జిజిహెచ్ కు తరలించినట్లు తండ్రి చెప్పుకొచ్చారు.
దీంతో పోలీసులు కిరణ్ అతని గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టగా అందరూ పరారీలో ఉన్నట్లు తేలింది. దీపక్ సోదరుడు తరుణ్ ను పాత కక్ష ల నేపధ్యంలో మూడేళ్ల క్రితం ఇదే తరహాలో హత్య చేశారు. అయితే అప్పటి హత్యకు కిరణ్ కు ఏమైనా సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పాత గుంటూరు సిఐ సోమయ్య చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..