Andhra News: ఓర్నీ.. చిన్న టీ కప్పు గాడిద పాల రేటెంతో తెలిస్తే మతిపోవడం ఖాయం.. !
ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది.
ఏపీలో గాడిదపాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడటంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో పెద్ద ఎత్తున గాడిద పాలన సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది. చాలా కాలంగా గాడిదలను పెంచుతూ మాంసం కోసమే వాటిని పెంచి పోషించిన చాలా మంది ప్రజల్లో గాడిద పాల పట్ల ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు వారంతా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండి ఇస్తున్నారు. ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటివి నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. దీంతో చలికాలం వచ్చినా.. నాలుగు నెలల పాటు విపరీతమైన డిమాండ్ గాడిద పాలకు నెలకొంది.
గాడిద పాలకు డిమాండ్‌తో పాటు ధర సైతం ఎక్కువే.. ఒక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాలు ధర ₹100 ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే ₹7000 వరకు ఖర్చవుతుంది. గాడిదను పెంచడానికి పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవడంతోనే గాడిద పాల ధర కూడా అధికంగా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కొక్క గాడిద రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తారని అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో A విటమిన్, బి1, బి5, బి6, పాటు ఫోలిక్ ఆమ్లం ఉండటంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు.
ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలామంది గాడిదలను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలను పిండిస్తున్నారు. పొద్దున్నే లేవగానే వచ్చి పాలను లైవ్‌లో పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నామని ఇంటిముంగిటే వచ్చి గాడిద పాలు ఇవ్వడంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారాలు అంటున్నారు. విజయవాడ, గుంటూర్, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో నాలుగు నెలల పాటు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తామని తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చి వ్యాపారులు చేసుకుంటున్నారు. సీజన్లో గాడిద పాలు రెగ్యులర్గా దొరకడం కష్టం, ఆవు పాలు, గేదె పాలు లాంటివి సాధారణంగా మనకి ఎక్కడ కావాలన్నా మార్కెట్లలో దొరుకుతాయి లేదా ఫామ్ నుంచి నేరుగా తెచ్చుకోవచ్చు.. కానీ గాడిదని పెంచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం గాడిద ఫామ్‌లను సైతం ఏర్పాటు చేసేవాళ్లు ఎక్కడో ఒకచోట తప్ప ఉండే అవకాశం లేకపోవడంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి