AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra pradesh: యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ‘కియా నాలెడ్జ్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌’.. రూ. 2 కోట్లతో ఏపీ ప్రభుత్వం.

యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 'కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్'ను ప్రారంభించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా..

Andhra pradesh: యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా 'కియా నాలెడ్జ్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌'.. రూ. 2 కోట్లతో ఏపీ ప్రభుత్వం.
Representative Image
Narender Vaitla
|

Updated on: May 29, 2023 | 6:28 PM

Share

యువతలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ‘కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్’ను ప్రారంభించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా డోన్ పట్టణంలోని ఐటీఐ కళాశాలలో రూ.2 కోట్లతో ‘ఎక్స్ లెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటైన ఈ సెంటర్ లో 10 కోర్సులలో వందలాది మంది యువతకు శిక్షణనందించనున్నట్లు మంత్రి తెలిపారు.

కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ భవనంలోని పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ఆటోమొబైల్, మెకానికల్, వెల్డింగ్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, సివిల్ , సీఎన్ సీ, డైకిన్ ల్యాబ్‌లను రిబ్బన్ కట్ చేసి ఓపెన్‌ చేశారు. ఏడాది గడువుతో 2 కోర్సులు, రెండేళ్ల వ్యవధితో 8 కోర్సుల్లో శిక్షణకు అనువుగా ఎక్స్ లెన్స్ సెంటర్ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ లో 484 మంది యువతీయువకులకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్ సీవీటీ) అనుబంధ కోర్సులకు ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు.

ఎలక్ట్రిషియన్, వైర్ మెన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీఎం సివిల్, మెకానికల్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్ రంగాల్లో యువతకు ఉపాధి, శిక్షణనందించేలా ఎక్స్ లెన్స్ సెంటర్ పని చేస్తుందన్నారు. ఆర్థిక, నైపుణ్య శిక్షణ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, కియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ వేదికపై పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. యువతకు శిక్షణ నందించే దిశగా కియా పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. శిక్షణ తీసుకునే 300 మంది యువతకి హాస్టల్ వసతికి సంబంధించి రూ.5.5 కోట్లతో భవన నిర్మాణం చేపడుతున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాలకు ఏపీని చిరునామాగా మార్చే ప్రణాళికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ‘స్కిల్ గ్యాప్’ను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు, ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. డోన్ నియోజకవర్గంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, ఐడీటీఆర్ (ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ సంస్థ), ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, మహిళలకు ప్రత్యేకంగా కళాశాల, హార్టికల్చర్ యూనిట్,బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్ (బాలురకు), పాలిటెక్నిక్ కాలేజ్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వంటి ఎన్నో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో అభివృద్ధికి సాక్ష్యంగా డోన్ నిలిచిందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..