Donkey meat: గాడిద మాంసం తింటే నిజంగానే కండరాలు బలంగా అవుతాయా..? ఇదిగో క్లారిటీ

గుంటూరు జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో గాడిద మాంసం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వారాంతాల్లో అత్యధిక సంఖ్యలో గాడిదలు వధించబడుతున్నాయి. కాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ లో గాడిదలను వధించడం నిషేధంగా పేర్కొనట్లు ఫుడ్ సేఫ్టి అధికారులు తెలిపారు.

Donkey meat: గాడిద మాంసం తింటే నిజంగానే కండరాలు బలంగా అవుతాయా..? ఇదిగో క్లారిటీ
Donkey Meat
Follow us
Ram Naramaneni

|

Updated on: May 29, 2023 | 6:10 PM

గాడిద పాలు లీటర్‌ 4 నుంచి 6 వేల రూపాయలట. ఏకంగా గాడిదల ఫామ్‌ పెట్టి మరీ పాలు అమ్ముతున్నారు. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతాయంటున్నారు. ఈ క్రమంలో గాడిద మాంసానికి కూడా గిరాకీ తెగ పెరిగిపోయింది. గాడిద మాంసం తింటే అపరిమితమైన శక్తి వస్తుందన్న అపోహలు.. అలాగే గాడిద రక్తం తాగితే ఉబ్బసం తగ్గిపోతుందని, శక్తి వస్తుందని కొందరు భావిస్తున్నారు. దీంతో గాడిద మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా గాడిదలను విపరీతంగా వధించడంతో దేశంలో అంతరించిపోయే జాబితాలో ఇవి కూడా చేరిపోయాయి

గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు తోట, ఓల్డ్ గుంటూరు, ప్రత్తిపాడు రోడ్డులో విచ్చలవిడిగా గాడిదలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించిన బ్లూ క్రాస్ సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన జంతు ప్రేమికులకుపై గాడిదమాంసం విక్రేతలు దాడికి యత్నించారు. గాడిద మాంసం తినకూడదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా నిబంధలున్నా పట్టించుకోవడం లేదని, గాడిదలను వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు. దీన్ని అరికట్టడానికి పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాళ్లు.

గాడిద మాంసం తినడం అరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. గాడిద మాంసం తింటే కండరాలు బలోపేతం అవ్వటం, ఉబ్బసం తగ్గడం వంటి ఆలోచనలు అపోహేనని క్లారిటీ ఇచ్చారు. రెడ్ మీట్ తింటే కొవ్వు పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గాడిద మాంసం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు కూడా  స్పష్టత ఇస్తున్నారు. గాడిదలను వధించేందుకు ఎటువంటి అనుమతులు లేవంటున్నారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. ఎక్కడైనా గాడిదలను వధిస్తే వెంటనే స్థానిక సంస్థల ప్రతినిధులు చర్యలు తీసుకోవచ్చంటున్నారు వాళ్లు. గాడిదల వధను అరికట్టకపోతే కొంత కాలానికి వాటిని కూడా ఏ జూలోనో చూసే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి