Govt Employees: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి కోసం కీలక నిర్ణయం..
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap government) శుభవార్త చెప్పింది. పీఆర్సీ నివేదిక ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులపై
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap government) శుభవార్త చెప్పింది. పీఆర్సీ నివేదిక ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులపై ఉత్తర్వులిచ్చింది. దత్తత పిల్లలు.. పిల్లల సంరక్షణ.. వికలాంగులకు..స్పెషల్ క్యాజువల్ సెలవులు.. పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లల సంరక్షణ కోసం ఇకపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల వరకూ సెలవులు తీసుకోవచ్చు. అంతేకాకుండా.. సెలవుల రోజులకు కూడా పూర్తి జీతం తీసుకోవచ్చ. అలాగే.. ఈ సెలవులు… ఇతర సెలవులతో కలిసి ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.
పిల్లల సంరక్షణ సెలవులు ఇంతకు ముందు 60 రోజులు ఉండగా.. ఇక నుంచి వాటిని 180 రోజులకు పెంచుతూ జీవో జారీ చేసింది. ఉద్యోగి ఈ సెలవులను తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు.. అలాగే ఈ సెలవులు.. పెళ్లికానీ వారు.. భార్య చనిపోయినవారు.. విడాకులు తీసుకున్న పురుషులకు కూడా వర్తిస్తుంది. ఇక దత్తత తీసుకున్న శిశువు నెలరోజుల లోపు ఉంటే.. వారికి ఏడాది వరకు సెలవులు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే.. ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు ఉంటే.. మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. దత్తత తీసుకునేవారికి అప్పటికే పిల్లలుంటే ఈ సెలవులు వర్తించవు..
అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారికి అసాధారణ సెలవులు మంజూరు చేస్తారు. వారు చికిత్స తీసుకుంటున్న సమయంలో ప్రభుత్వం వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఇవ్వనుంది. అలాగే నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ. 11,560 నుంచి.. రూ.17,780 వరకు ఎక్స్ గ్రేసియా పెంచింది. అలాగే.. లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఇస్తారు.. అలాగే ఆర్జిత సెలవులు.. సగం జీతం సెలవులు ముగిసిన తర్వాత కూడా మరిన్ని సెలవులు తీసుకోవచ్చు..
Also Read: Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..
Samyuktha Menon: భీమ్లానాయక్ బ్యూటీకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు.