AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FactCheck: ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’కు నిర్వచనం ఇదే.. ఆన్‌లైన్ అరాచకానికి ఫ్యాక్ట్ చెక్‌ అడ్డుకట్ట

సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మారుతోంది. టెక్నాలజీని ఆసరగా చేసుకొని కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వదులుతున్నారు. దీంతో కొందరు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’ అనే నిర్వచనాన్ని ఏపీ ప్రభుత్వం మార్చలేదని నిరూపించింది. అయితే అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..

FactCheck: ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’కు నిర్వచనం ఇదే.. ఆన్‌లైన్ అరాచకానికి ఫ్యాక్ట్ చెక్‌ అడ్డుకట్ట
Factcheck Oxford Dictionary
Sanjay Kasula
|

Updated on: May 31, 2023 | 5:02 PM

Share

ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌… ఒక్క క్లిక్ కొడితే చాలు.. క్షణాల్లో వైరల్.. మెసేజ్, వీడియో, మరొకటి… ఏదైనా సరే.. అందులో నిజం ఏంటో తెలుసుకోకుండానే వైరల్ చేస్తున్నారు జనం. ఇది అబద్దం అని ఖండించేలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది. కొంతమంది పని కట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల.. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్ట దెబ్బ తింటోంది. ఈ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌తో చెక్ పెడుతోంది. తాజాగా మరో అసత్య ప్రచారాన్ని బయట పెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ పేరు మీద డిక్షనరీలో యేసు క్రీస్తు గురించి మత ప్రచారం ఉందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘గాడ్‌పేరెంట్’ పదం నిర్వచనాన్ని చూపిస్తూ ఏపీ ప్రభుత్వం మార్పులు చేసిందని వీడియో ద్వారా ఆరోపిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో ఓసారి చూద్దాం.

క్లెయిమ్..

ఏపీ ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’ ఈ రెండిటి అర్ధాలకు చేసిన మార్పులను చూపించే వీడియో.

ఫాక్ట్ ఏంటంటే..

మార్కెట్‌లో లభించే నిఘంటువుతో పోలిస్తే, ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘గాడ్’, గాడ్‌పేరెంట్ ‘ గురించిన కంటెంట్ ఒక్కటే. కొన్ని ఇతర నిఘంటువులు కూడా ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్ ‘ ఇదే విధమైన నిర్వచనాన్ని కలిగి ఉన్నాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నిఘంటువులకు ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఆక్స్‌ఫర్డ్ లర్నర్ డిక్షనరీలో ‘గాడ్’ నిర్వచనం “(క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజంలో) ఆరాధించబడే, విశ్వాన్ని సృష్టించినట్లు విశ్వసించబడే ఆత్మ. గాడ్‌పేరెంట్ అంటే, “క్రైస్తవ బాప్తిసం వేడుకలో ఒక బిడ్డకు బాధ్యత వహిస్తాను,  క్రైస్తవ మతం గురించి వారికి బోధిస్తానని వాగ్దానం చేసే వ్యక్తి.” గాడ్ పేరెంట్ అనేది ఎక్కువగా క్రైస్తవ మతంతో సంబంధం ఉన్న పదం.

ఆన్‌లైన్‌లో ఎన్నో నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చాలా వరకు విశ్వసనీయమైనవి. ఈ నిఘంటువులలోని నిర్వచనాలను మనం పోల్చినట్లయితే.. కొన్నిట్లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇచ్చిన నిర్వచనాల మాదిరిగానే ఉన్నాయి. ఒక నిఘంటువు సాధారణంగా ఒక పదానికి బహుళ నిర్వచనాలను ఇస్తుందని.. అందులో ఆన్‌లైన్‌ నిఘంటువులు కూడా ఉన్నాయని గమనించాలి.

ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్ ఇక్కడ చూడండి..

కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆన్‌లైన్‌:

కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆన్‌లైన్‌ వెబ్ సైట్, ‘గాడ్’ అర్థం ఇలా ఇవ్వబడింది.“(క్రైస్తవ, యూదు, ముస్లిం నమ్మకంలో ) విశ్వం, భూమి, దాని ప్రజలను సృష్టించి పాలించే జీవి.” గాడ్‌పేరెంట్ ఒక నిర్వచనం ఏంటంటే, “మరొకవ్యక్తి బిడ్డ నైతిక, క్రైస్తవ మత అభివృద్ధికి పాక్షికంగా బాధ్యత వహించే వయోజనుడు.”

ఫ్యాక్ట్ చెక్‌ ఏం చేస్తోంది..

సోషల్ మీడియాలో ఏదైనా అంశం మీద నడుస్తున్న ప్రచారం ఎలా ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైట్‌లో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. ఇది చూస్తే నిజమేంటో, అబద్ధం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. వ్యక్తులు, వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని… ఇలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలుకుతోంది. గూగుల్ కూడా మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్‌ ద్వారా ఏది కరెక్టో నిర్దారించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం